Menu Close
mg

మధురం మధురం ఈ సమయం

ఏదైనా ఒక పాట పరిమళించి మధురానుభూతులను కలిగించాలంటే అందుకు మూడు కారణాలు. ఒకటి రచయిత భావస్పందనా పటిమ, రెండు ఆ భావాలకు మంచి బాణీలను సమకూర్చే స్వరకర్త, ఇక మూడు, ఆ రెండింటిని మన వీనులకు విందుగా వినపించగలిగే సుమధుర గాత్రం. మరి ఈ మూడు అంశాలు సమపాళ్ళలో సమకూరితే ఆ పాట మరి సూపర్ హిట్ కాకుండా ఎలా ఉంటుంది. అటువంటిదే ఈ ‘భావియే వెలిగె పూవుల బాటగా’ అని పవిత్ర ప్రేమకు బందీలైన భార్యాభర్తలు అనుభవించి ఆస్వాదించిన ఈ పాట మనం కూడా ఆలకిద్దాం.

చిత్రం: భార్యాభర్తలు (1961)
సాహిత్యం: శ్రీరంగం శ్రీనివాసరావు

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

చరణం 1:

చల్లని పున్నమి వెన్నెలలో.. ఓ ఓ ఓ ఓ ఓ ...
ఎన్నడు వీడని కౌగిలిలో.. ఆ ఆ ఆ ఆ ....
చల్లని పున్నమి వెన్నెలలో.. ఎన్నడు వీడని కౌగిలిలో
కన్నుల వలపు కాంతులు మెరయగ
మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

చరణం 2:

కరగిపోయె పెను చీకటి పొరలూ.. ఊ ఊ ...
కరగిపోయె పెను చీకటి పొరలూ
తొలగిపోయె అనుమానపు తెరలు.. తొలగిపోయె అనుమానపు తెరలు
పరిమళించె అనురాగపు విరులు.. పరిమళించె అనురాగపు విరులు
అలరెనే మనసు నందన వనముగ
మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

చరణం 3:

సఫలమాయే మన తీయని కలలూ..ఊ ఊ ...
సఫలమాయే మన తీయని కలలు
జగము నిండె నవజీవన కళలు.. జగము నిండె నవజీవన కళలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు.. పొంగిపొరలె మన కోర్కెల అలలు
భావియే వెలిగె పూవుల బాటగా
మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Posted in November 2020, పాటలు