కదంబం - సాహిత్యకుసుమం
పల్లవి
ఘల్లు ఘల్లు గజ్జెల చప్పుడుతో
గల గల గాజుల సవ్వడితో
కనకభూషిత పట్టు చీర కట్టి
నొసటన సూర్యబింబ బొట్టు పెట్టి
పసిడి కిరణాల ఆభరణాలు వేసి
బంగారు రథముపై వచ్చింది తల్లి బతుకమ్మ
మా తెలంగాణకు పండగ శోభ వచ్చింది మళ్ళీ
బంగారు రథముపై వచ్చింది తల్లి బతుకమ్మ
మా తెలంగాణకు పండగ శోభ వచ్చింది మళ్ళీ
చరణం – 1
పుడమిలో పూలన్నీ
పుత్తడి పళ్ళెంలో చేర్చి
బంగారు రథముగా
మారేనమ్మ
పసుపు ముద్ద చేసి
నొసట కుంకుమ బొట్టెట్టి
గౌరమ్మగా నిన్ను నిలిపామమ్మ
ఆ నక్షత్రాలే దివ్వెలాయెనమ్మ
వనితలారా రారండి పళ్ళాలు పట్టండి
పెద్దలారా చిన్నలారా పూలరథం ఎత్తండి
ఆటపాటలతో అమ్మను అలరించండి
బతుకమ్మ కళ్ళలో ఆనందం చూడండి
ఆ తల్లి దీవెనలు అందుకోండి
సుఖ శాంతుల సౌఖ్యాలు పొందండి
చరణం – 2
జాతరమ్మా జాతర
బతుకమ్మ జాతర.
రంగు పూల జాతర
మా బతుకమ్మ జాతర.
హోయ్ హోయ్
వనితలారా రారండి
పాటలన్నీ పాడండి.
యువతులారా రారండి
కోలాటం ఆడండి..
అన్నలారా తమ్ములారా
తాతా అవ్వలారా
అందరూ ఆడండి, పాడండి
అమ్మను స్తుతించండి. హోయ్ హోయ్
ఆటపాటలతో అమ్మను అలరించండి
బతుకమ్మ కళ్ళలో ఆనందం చూడండి
ఆ తల్లి దీవెనలు అందుకోండి
సుఖ శాంతుల సౌఖ్యాలు పొందండి