Menu Close
Kadambam Page Title
ఆహా బాపూ!
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

అమ్మాయి ఒంపుల్లో బాపు
అమ్మాయి సొంపుల్లో బాపు
అమ్మాయి నడుములో బాపు
అమ్మాయి నడకలో బాపు
అమ్మాయి అలుకలో బాపు
ఆమె చేతిలోని చిలుకలో బాపు
అమ్మాయి అధరంలో బాపు
అమ్మాయి హృదయంలో బాపు
అమ్మాయి కురులలో బాపు
అమ్మాయి మరులలో బాపు
అమ్మాయి పేరులో బాపు
అమ్మాయి తీరులో బాపు
అమ్మాయి షోకులో బాపు
అమ్మాయి చూపులో బాపు
అసలు అమ్మాయి అందానికి
ఒక రూపు తెచ్చిన వాడే ఈ బాపు
దేవుణ్ణి, జీవుణ్ణి కూడా నవ్యంగా చూపు
సంసారాన్ని, సన్యాసాన్ని కూడా సవ్యంగా చూపు
అందమైన క్షణాన్ని తన కుంచెతో శాశ్వతంగా ఆపు
అందాలకు అతనే అసలైన కాపు
నిరాడంబరానికి అతనే అసలైన షేపు
ఇలా అతనిని వివరించటం ఎంత సేపు?
అతనిని వరించటం వింత తీపు.
అతనికి అందింది దేవుని పిలుపు
అతని దగ్గరే ఇంక బాపు కొలుపు.

Posted in December 2023, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *