Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౧౦౨౧. కీలెరిగి వాత పెట్టాలి.

౧౦౨౨. కీడెంచి మేలెంచాలి.

౧౦౨౩. కుంటి సాకులు, కొంటి మాటలు ఎల్లప్పుడూ రాణి౦చవు.

౧౦౨౪. కుండ వేరైనప్పుడే కుదురూ చెదిరిపోయింది.

౧౦౧౫. కుండ మూసే మూకుడుంది గాని, లోకులనోర్లు మూయగల మూత లేదు.

౧౦౨౬. కుండమీది దుమ్ము కుదురుగా దులపాలి.

౧౦౨౭. కుక్కకు ఏ వేషం వేసినా అది మొరగడం మానదు.

౧౦౨౮. కుక్కతోక సాగదీస్తే చక్కనౌతుందా?

౧౦౨౯. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదగలమా?

౧౦౩౦. కుడితిలో పడ్డ ఎలుకలా ...

౧౦౩౧. కులం చెడ్డా సుఖం దక్కాలి.

౧౦౩౨. కాకిని తెచ్చి పంజరంలో పెట్టి పెంచితే అది చిలకలా పలుకగలదా!

౧౦౩౩. కాగల కార్యం గంధర్వులే తీర్చారు.

౧౦౩౪. కాటి దగ్గర చెప్పే మాటలు కూటి దగ్గర పనికిరావు.

౧౦౩౫. చెట్టు నీడ అమ్మ ఆదరణ లాంటిది.

౧౦౩౬. కానవచ్చే కొండల్ని గట్టెక్కి చూడాలా!

౧౦౩౭. కానున్నది కాకమానదు.

౧౦౩౮. కాపుల కష్టమే భూపుల సంపద!

౧౦౩౯. కామి గాని వాడు మోక్షగామి కాడు.

౧౦౪౦. కాలం గడిచి పోతుంది గాని మాట నిలిచిపోతుంది.

౧౦౪౧. కాలికి వేస్తె మెడకు, మెడకు వేస్తె కాలికి ...

౧౦౪౨. కాలూ చెయ్యీ చల్లగా ఉంటేనే కాలం చక్కగా గడుస్తుంది.

౧౦౪౩. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చుగాని, నోరు జారితే వెనక్కి రాదు.

౧౦౪౪. కాలువ దాటలేని వాడు కడలిని దాటగల నన్నాడుట!

౧౦౪౫. కాలిని పోయే కంపని ఎత్తి, తలకు తగిలించుకున్నట్లు అయ్యింది.

౧౦౪౬. కూటికీ గుడ్డకీ లోటు లేకుంటే కోట్ల సంపద ఉన్నట్లే ...

౧౦౪౭. కూడబెట్టేవాడు కుడువ నేర్వడు.

౧౦౪౮. కూర్చుని తింటే కొండలు తరిగిపోతాయి.

౧౦౪౯. కూటిలో వచ్చిన రాయిని తీసి పారెయ్యలేనివాడు, ఏటికి అడ్డమొచ్చిన రాయిని ఎత్తి పారేస్తా - అన్నాడుట!

౧౦౫౦. కూర్చుని పని చేసేవాడికి కుప్పలు, తిరిగి పనిచేసేవాడికి తిప్పలు!

Posted in October 2020, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!