Menu Close
mg

జయ కృష్ణా... ముకుందా... మురారి

సంగీతంలో ఆస్తికత్వము, నాస్తికత్వం అంటూ ఏమీ ఉండదు. స్వరకల్పనలో పొందుపరచిన రాగం, హృదయవీణ ను తాకితే, మన ప్రమేయం లేకుండానే మన మనసు పులకరిస్తుంది. తదనుగుణంగా తనువూ పరవశించి ఎంతో హాయి కలుగుతుంది. ఏ పాటైన ఎంతో మాధుర్యంతో మనకు వీనులవిందు చేస్తున్నదంటే అందుకు కారణం ఆ గీతాన్ని రచించిన రచయిత, స్వరకల్పన చేసిన సంగీత దర్శకుడు, వీటన్నింటికీ మించి తమ గాత్ర శుద్ధితో ఆ పాటకు ప్రాణం పోసిన గాయకుడు. ‘శ్రీ పాండురంగ మహత్యం’ సినిమా కొరకు సముద్రాల గారు రచించగా, టి.వి.రాజు గారి స్వరకల్పనలో, పద్మశ్రీ ఘంటసాల గారు ఆలపించిన అటువంటి అద్భుతమైన ఆణిముత్యం మీ కోసం అందిస్తున్నాము. ...

చిత్రం: శ్రీ పాండురంగ మహత్యం (1957)
సాహిత్యం: సముద్రాల (సీనియర్)

సంగీతం: టి.వి. రాజు
గానం: ఘంటసాల

పల్లవి:

హే... కృష్ణా.... ముకుందా.... మురారీ....
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి

దేవకి పంట... వసుదేవువెంట....
దేవకి పంట... వసుదేవువెంటా...
యమునను నడిరేయి దాటితివంటా.. ఆ..ఆ
వెలసితివంటా... నందుని ఇంటా
వెలసితివంటా... నందుని ఇంటా
వ్రేపల్లె ఇల్లాయేనంటా...ఆ..

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి

చరణం 1:

నీ పలుగాకి పనులకు గోపెమ్మ...
నీ పలుగాకి పనులకు గోపెమ్మ... కోపించి నిను రోట బంధించెనంటా..ఆ..ఆ..
ఊపునబోయీ మాకులగూలిచి....
ఊపునబోయీ మాకులగూలిచి... శాపాలు బాపితివంటా....ఆ...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి

అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ... చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా.. అని చెవి నులిమి యశోద.. ఏదన్నా నీ నోరు చూపుమనగా...ఆ...
చూపితివట నీ నోటను... బాపురే పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు... తాపము నశియించి.. జన్మ ధన్యత గాంచెన్..

జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ...
కృష్ణా... ముకుందా... మురారి

చరణం 2:

కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ...
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ... కేళీ ఘటించిన గోపకిశోరా..ఆ..ఆ
కంసాదిదానవ గర్వాపహారా...
కంసాదిదానవ గర్వాపహారా... హింసా విదూరా.. పాపవిదారా...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి

కస్తూరి తిలకం... లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం... నాసాగ్రే నవమౌక్తికమ్
కరతలే వేణుమ్... కరే కంకణమ్
సర్వాంగే హరిచందనంచ కలయమ్
కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో...
విజయతే... గోపాల చూడామణీ...
విజయతే... గోపాల చూడామణీ...

చరణం 3:

లలిత లలిత మురళీ స్వరాళీ...
లలిత లలిత మురళీ స్వరాళీ... పులకిత వనపాళి... గోపాళీ..
పులకిత వనపాళి...ఈ...
విరళీకృత నవ రాసకేళి...
విరళీకృత నవ రాసకేళి... వనమాలీ శిఖిపింఛమౌళీ
వనమాలీ శిఖిపింఛమౌళీ....

కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి..
జయ కృష్ణా... ముకుందా... మురారి..
హే... కృష్ణా.... ముకుందా.... మురారీ.... ఈ.. ఈ..

Posted in October 2020, పాటలు