Menu Close
Kadambam Page Title
ఆల్_ఇన్_వన్...!!
-- డా.కె .ఎల్ .వి.ప్రసాద్

స్మార్టు ఫోన్లు
సముద్ర తరంగాలై
ఎగసిపడుతున్నవేళ
లేనిదంటూ లేని,
ఆ ..మాయావి
ఒక చిన్న కంప్యూటరై
మానవ జీవితంలో,
ఆహరం తరువాత
అతి ముఖ్య అవసరం,
అయిపొయింది!

కూలివాడి దగ్గరనుంచి
కలెక్టర్ల వరకూ ...
పాలవాడి దగ్గరనుంచి
ప్రజానాయకుడి వరకూ
మొబైల్ ఒక
ముఖ్య అవసర వస్తువయింది ....!

మొబైల్ ...
మనముంగిట వాలి,
రిస్ట్ వాచీ, గోడ గడియారం
అవసరం లేకుండా చేసింది...!

కెమెరాతో ...
పనిలేకుండా చేసింది ,

కాలికులేటర్ __
తానై కూచుంది ,

తానే ...
అలారమై మ్రొగింది ,

నేనుండగా ....
క్యాలెండరుతో
పని ఏమి అంది !

నిఘంటువును నేనే ,
సకల విజ్ఞాన సర్వస్వము
నేనే ..అంటుంది ,

టెలిగ్రామ్ కు ట్రంకాల్ కు
చెల్లు చీటీ పలికించింది ,

ప్రేమలేఖలకు _
గ్రీటింగ్ కార్డులకు ..
బై ..బై ..చెప్పించింది

ప్రసార _ ప్రచార
మాధ్యమంగా ,
ప్రజల చేతికి ...
ముఖ్య అలంకా రమైంది !

గ్రూపులు కట్టడం
నేర్పిందిదే ...
గౄపుల్లో
రకరకాల ట్రూపులు
విభజించింది ఇదే !

కలమూ ఇదే ...
కుంచే ఇదే ...
దారి చూపించే ,
దిక్చూచికూడా ఇదే !

మారువేషాలు
వేయించేదీ ఇదే ,
మాట్లాడితే ...
అక్షరంగా
రూపాంతరం చేసేదీ
ఇదే ....!

అందుకే __
ఆదునిక మానవుడికి
మొబైల్ ఒక
నిత్య అవసరం అయింది !
ముఖ్య పనిముట్టు _
జాబితాలో చేరింది !!

Posted in October 2020, కవితలు

35 Comments

 1. Eluzai

  మొబైల్ ఫోనుకు కూడా ప్రాణంపోసింది మీ కవిత,
  మనం మన ఇష్టానుసారంగా పొందవలసిన సేవలు,
  అదే మనకు బలవంతంగా అందించే స్థాయికి చేరింది.
  పోను పోను ఫోను కంటే ఫోను కవితే బాగుంది అన్నయా

  మీ ఎలూ జయ్

 2. Dr. O. Nageswara Rao

  Very good description regarding mobile phone .
  No need of video camera, Computer, TV , banking, Exams, jobs etc.
  Due to Corona mobile became under Essential Commodity.
  People are learning English, getting lot of awereness towards health, living style everything.
  Any how you have given very good Emazing Entry towards mobile, mainly we are readily waiting for your arrival of Hot hot Samosas.
  Congrats Drklv for mobile recipy.

 3. కుసుమ Ramesh

  సెల్ మన శరీరం లో ఒక భాగం మై , కూచుంది….. చాలా బాగా చెప్పారు సర్……..కుసుమ రమేష్, హెల్త్ కౌన్సిలర్.

 4. డి.వి.శేషాచార్య

  మొబైల్ ఫోన్ మనిషికి నిత్యావసర వస్తువు మాత్రమే కాదు. మానవ జీవితానికి శాసించే స్థాయికి చేరింది. కవిత చాలా బావుంది.

 5. డి.వి.శేషాచార్య

  ఆధునిక మానవ జీవితంలో మొబైల్ ఒక భాగం మాత్రమే కాకుండా మానవ జీవితాన్ని శాసించే స్థాయికి చేరింది. మొన్నటి వరకూ పిల్లల చేతికి మొబైల్ చేరకుండా చూసిన తల్లిదండ్రులు పిల్లల చేతుల్లో మొబైల్ పెట్టాల్సిన దుస్థితి దాపురించింది.

  మొబైల్ గురించి చాలా చక్కగా చెప్పారు. అభినందనలు.

 6. డా.కె.ఎల్.వి.ప్రసాద్

  పొగడ్తల పూదండలని ధరిస్తుంది.
  తిట్లు శాపనార్ధాల పుష్పగుచ్చాలని
  సమాదరిస్తుంది.
  తన జీవితకాలం 2-3 ఏళ్లే అయినా
  దినమంతా మనతోనే చరిస్తుంది.
  ——అనీల్ ప్రసాద్
  హనంకొండ

 7. మొహమ్మద్ .అఫ్సర వలీషా

  చాలా చాలా బాగుంది సార్ కవిత చాలా బాగా వ్రాశారు ఈ ఆధునిక ప్రపంచం అంతా చరవాణి మయమైంది.చక్కని పదబంధాలతో చిక్కని కవిత అద్భుతంగా ఉంది హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 💐💐💐💐💐💐💐💐💐💐💐🙏

 8. Jhansi koppisetty

  Wonderful poem👌👌👌
  అన్నీ నిజాలే… ముఖ్య అవసరం కాదు అవసరాన్ని మించిపోయింది. అది లేకుండా క్షణం గడవని పరిస్థితి😀😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *