Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు కేదారి -
ఈశావ్యాస్యోపనిషత్తు

గత సంచిక తరువాయి... »

ఆరవ మంత్రం

యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే

భావం: ఆత్మే సకల జీవరాసులుగా ఉంటుందని గ్రహించి, ఏకత్వ భావన ఏర్పరచుకున్న వ్యక్తికి మోహo ఎక్కడుంటుంది, శోకం ఎక్కడ ఉంటుంది?

భాష్యం: ఎవడు సర్వ జీవులను ఆధ్యాత్మిక దష్టితో, భగవంతుని గుణాలతో ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడో, అతను నిజమైన తత్వ పరిజ్ఞానం గలవాడు అవుతాడు. అలాంటి వానికి మోహo గాని శోకం గాని ఎలా ఉంటాయి. మనము అయిష్టమైన దానిని ద్వేషిస్తాం. మనకు ఇష్టమైన దానిని చూడడం వలన మోహం కలుగుతుంది. కోరుకున్నది లభించనప్పుడు దిగులు కలుగుతుంది. ఆత్మానుభూతి ప్రాప్తించుకున్న వ్యక్తికి ఇవేమీ ఉండవని ఈ మంత్రం ఉపదేశిస్తుంది.

ఎవడు సర్వ జీవులను ఆధ్యాత్మిక దష్టితో, భగవంతుని గుణాలతో ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడో, అతను నిజమైన తత్వ పరిజ్ఞానం గలవాడు అవుతాడు. అలాంటి వానికి మోహo గాని శోకం గాని ఎలా ఉంటాయి. మనము అయిష్టమైన దానిని ద్వేషిస్తాం. మనకు ఇష్టమైన దానిని చూడడం వలన మోహం కలుగుతుంది. కోరుకున్నది లభించనప్పుడు దిగులు కలుగుతుంది. ఆత్మానుభూతి ప్రాప్తించుకున్న వ్యక్తికి ఇవేమీ ఉండవని ఈ మంత్రం ఉపదేశిస్తుంది.

ఏడవ మంత్రం

యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః
తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః

భావం: ఆత్మానుభూతి పొందిన వాడు.... అలాంటి వ్యక్తి సర్వశక్తిమంతుడు. దేవాది దేవుడై ఉండి దేహము లేని వాడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, దోష రహితుడు, శుద్ధుడు, కల్మషం లేనివాడు, స్వయం సంపూర్ణుడు, అనాది కాలము నుండి అందరి కోరికలను తీర్చే తాత్వికుడు అయి అందరికంటే గొప్పవాడైన భగవంతుడిని అతడు చేరుకుంటాడు.

భాష్యం: ఆత్మానుభూతి పొందినవాడు, ప్రతి దృశ్యానికి వెనుక ఊగిసలాడే భగవంతుని ఉనికిని చూడగలుగుతాడు. మనిషి అంటే మనసును వశం చేసుకోవడానికి అతని బుద్ధిని కలిగిన వాడు. మనసును మనసు ద్వారా వశం చేసుకోలేం, అంతకంటే శక్తివంతమైనది మరొకటి కావాలి. అదే బుద్ధి. ఇది అందరిలోనూ పనిచేయ ప్రారంభించదు. ప్రార్థన, గాయత్రీ జపం లాంటి వాటితో ఇది జాగ్రుత్తమై ఉంటుందంటారు. ఆత్మను సాక్షాత్కారం చేసుకున్న వ్యక్తి, తనలోతాను తృప్తి పొందుతూ ఆగిపోతాడు. అందువల్ల ఆత్మానుభూతి పరిపూర్ణతతో అన్నింటిని తనలో పదిల పరుచుకొన్నదిగా తక్కిన జ్ఞానాలకన్నా ఉన్నతమైనదిగా పేర్కొనబడుతుంది.

ఆత్మానుభూతి పొందిన వ్యక్తి తనలోనూ, లోకంలోనూ భగవంతుని సాన్నిద్యాన్ని చవిచూసినందున అతడు దానిని అంటిపెట్టుకొని ఉంటాడే గానీ, వస్తువులను మనుషులను అంటిపెట్టుకొని జీవించడు. అందువల్ల అతడు దేనికీ చెందని వాడని చెప్పబడింది. అంతకన్నా అతడు నిజ వస్తువుల నిజ తత్వాన్ని అవగతం చేసుకుంటాడు.

ఈ మంత్రంలో ముఖ్యంగా భగవంతుని గురించి వర్ణించబడింది. ఆయనతో సమానులు గాని, ఎవరు అధికులు గాని లేరని చెప్పబడింది. భగవంతుడు తేజోమయమైన వాడు. ఆయన ప్రకాశం తోనే సమస్తము ప్రకాశాన్ని పొందుతుంది. ఈయన అంటూ భగవంతుని గుర్తుపట్టలేం. శరీరం లేని వాడు. పరిపూర్ణుడు. విభాగాలు లేని వాడు. అంటూ చెప్పడం దీనిని తెలియజేస్తుంది.

భగవంతుడు పవిత్రుడు, ఎలాంటి పాపము ఆయన దరిదాపులకు రాదు. లోకాన్ని తేజస్సు ద్వారా ప్రకాశింప చేయడం వలన, లోకానికి నేత్రంగా ఉండేవాడు సూర్యుడు, అలానే భగవంతుడు తేజోమయుడుగా చెప్పబడ్డాడు.

**** సశేషం ****

Posted in February 2024, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!