Menu Close
Samudraala Harikrishna
చిత్ర వ్యాఖ్య
-- సముద్రాల హరికృష్ణ --
Vrishabha-Geetham

వ్రృషభ గీతం!!

ఓయి ఏమిత్తురోయి దేవ
దయ లేని వారీ ఇలను!
***
మోయగను బరువులే గాని
కాయగాయ మా కాయమది!
***
రేయి వాల్చినదె యీ మేను
ఆయువె తరిగె కరిగెనిక!
***
మా నేత నందైన చెప్పడో
మానేదెపుడో కాఱు చాకిరి!
***
నోరు వాయీ లేని ఈ జీవిపై
కరుణించర శివ,నీ కనుల చూసీ!


Eduruchoopulu

ఎదురుచూపులు!

బేల చూపులవి, దేనికే కపిల!
జాలి ద్రృక్కులవి, యేటికే ధవళ!
తల్లి ప్రేమలవి, యేరికే సుఫల!
మల్లె సురభుల దాగు,ఆ బాలుకే?!
(ii)
వ్రేపల్లె విడచి, కాళింది నొదలి
ఏ పొద్దు రాడేమొ,గోవింద దేవుడు?!


Emi-Koraka

ఏమి కోరక!!

దారాల హారాల నవతరించిన తొలి దేవరండి
వరాల గిరాల వేడక,నమములని తరలండి!!
(ఈ విగ్రహంలో ఏ పెయింట్ వాడబడలేదు,కేవలం పలు రంగుల దారాలతో చేయబడ్డది)


Mandekaalam

మండేకాలం!!

రోళ్ళు పెటిల్లనె, రోకళ్ళు పగిలె ,లేళ్ళ శిరముకై ఎదురు చూసె/
ఒళ్ళు చిర్రెత్త నెండల ప్రజ,వెళ్ళవె వెస రోహిణి,చంద్రుని జేరన్!
***
(లేళ్ళ శిరము=మ్రృగశిర కార్తె; చివర్లో: రోహిణి, చంద్ర సమీపవర్త కాబట్టి)

Posted in February 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!