Menu Close
Lalitha-Sahasranamam-PR page title

పంచదశోధ్యాయం (పూర్వార్ధము, ఉత్తరార్ధము)

(అమ్మవారి కాలస్వరూప నిరూపణ) శ్లోకాలు: 121-136, సహస్రనామాలు: 601-700

669. ఓం అన్నదాయై నమః
జీవకోటికి ఆహారాన్ని ప్రసాదించునట్టి అన్నధాత్రికి వందనాలు.


670. ఓం వసుధాయై నమః
ధనధాన్య రత్నాదులను ప్రసాదించు వసుధామూర్తికి ప్రణామాలు.


671. ఓం వృద్ధాయై నమః
వృద్ధి స్వరూపిణికి ప్రణామాలు.


672. ఓం బ్రహ్మత్మ్యైక స్వరూపిణ్యై నమః
బ్రహ్మత్మ్యైక స్వరూపిణికి వందనాలు.


673. ఓం బృహత్యై నమః
బృహత్సామ స్వరూపిణికి-గొప్ప తల్లికి వందనాలు.


674. ఓం బ్రాహ్మణ్యై నమః
విప్రస్త్రీ స్వరూపిణికి ప్రణామాలు.


675. ఓం బ్రాహ్మ్యై నమః
బ్రాహ్మీ దేవికి వందనాలు.


676. ఓం బ్రహ్మానందాయై నమః
బ్రహ్మానంద స్వరూపిణికి నమోవాకాలు.


677. ఓం బలిప్రియాయై నమః
అర్చనోపచారాదులలో ఒకటైన బలులయందు ప్రీతికల మాతకు ప్రణామాలు.


678. ఓం భాషారూపియై నమః
భాషయే స్వరూపంగా కల మాతకు ప్రణామాలు.


679. ఓం బృహత్సేనాయై నమః
విశేష సైన్యాలు కల మహాశక్తికి వందనాలు.


680. ఓం భావాభావవివర్జితాయై నమః
భావాన్నీ అభావాన్నీ కూడ పర్జించిన అతీతమూర్తికి ప్రణామాలు.


681. ఓం సుఖారాధ్యాయై నమః
సుఖంగా ఆరాధించదగిన దేవతకు నమస్కారాలు.


682. ఓం శుభకర్యై నమః
భక్తజనులకు శుభాలను చేకూర్చునట్టి మాతకు ప్రణామాలు.


683. ఓం శోభనాసులభాగత్యై నమః
మంగళములను పొందుటకు-అంటే మోక్షమార్గాన్ని సాధించుటకు సులభమైన గతిని ప్రసాదించు కరుణామయికి ప్రణామాలు.


684. ఓం రాజరాజేశ్వర్యై నమః
రాజరాజు అనగా కుబేర, ఇంద్రాదులు. అట్టి వారి కూడా ఈశ్వరి అయిన మాతకు వందనాలు.


685. ఓం రాజ్యదాయిన్యై నమః
మహత్తర రాజ్యాన్ని ప్రసాదించగల దయామయురాలికి ప్రణామాలు.


686. ఓం రాజ్యవల్లభాయై నమః
వైకుంఠ, కైలాసాది దివ్య సామ్రాజ్యాధీశ్వరికి ప్రణామాలు.


687. ఓం రాజత్కృపాయై నమః
కృపా విశేషంగా భాసిల్లునట్టి మాతకు ప్రణామాలు.


688. ఓం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః
మహత్తరైశ్వర్య సంబంధితమై పరమపావనమైన రాజపీఠాలే నివాసంగా గల మాతకు ప్రణామాలు.


689. ఓం రాజ్యలక్ష్మ్యై నమః
రాజ్యలక్ష్మీ స్వరూపంతో శాసించు మాతకు వినయాంజలులు.


690. ఓం కోశనాథాయై నమః
నవనిధులకు--సకల సంపదలకు అధీశ్వరియైన మహా మాతకు వందనాలు.


691. ఓం చతురంగబలేశ్వర్యై నమః
రథ, గజ, తురగ, పదాతి వర్గానికి చతురంగబలం అని పేరు. అట్టి చతురంగ బలాలను శాసించునట్టి మహాశక్తికి వందనాలు.


692. ఓం సామ్రాజ్య దాయిన్యై నమః
మహోత్కృష్ట సామ్రాజ్యాలను ప్రసాదించునట్టి దేవికి వందనాలు.


693. ఓం సత్యసంధాయై నమః
తన భక్తులను సత్యమార్గమునందు సత్యవ్రతులుగా చేయు తల్లికి వందనాలు.


694. ఓం సాగరమేఖలాయై నమః
సాగరమే మేఖల(వడ్డాణం)గా గల మాతకు నమస్కారాలు.


695. ఓం దీక్షితాయై నమః
పూర్ణదీక్షా పరురాలైన మాతకు పూర్ణదీక్షాపరులను అనుగ్రహించు తల్లికి ప్రణామాలు.


696. ఓం దైత్యశమన్యై నమః
దురహంకార పూరితులై, ఉద్దండులై లోకకంటకులైన రాక్షసులను అంతం చేయునట్టి మహేశ్వరికి నమస్కారాలు.


697. ఓం సర్వ లోక వశంకర్యై నమః
సర్వలోకాలను వశమందుంచుకొనునట్టి మాతకు నమస్కారాలు.


698. ఓం సర్వార్థ దాత్ర్యై నమః
సమస్తమైన అర్థాలనూ--అంటే కోరికలనూ నెరవేర్చునట్టి మాతకు ప్రణామాలు.


699. ఓం సావిత్ర్యై నమః
సావిత్రీ దేవి స్వరూపంలో తేజరిల్లునట్టి ఆదిశక్తికి వందనాలు.


700. ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః
అవి నాశనమై జ్ఞానానంద స్వరూపంతో భాసిల్లునట్టి దేవికి ప్రణామాలు.


* * * చతుర్దశ అధ్యాయం సమాప్తం * * *

----సశేషం----

Posted in February 2024, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!