Menu Close
Kadambam Page Title
ఉగాది
సౌందర్య లక్ష్మి కావటూరు

ఉగాది -
తెలుగువారి తొలి పండుగ
చేదు పండుగన్న నానుడే కానీ,
ఆ చేదునంటిన షడ్రుచుల మాట మరువగలమా?

ఆ పండుగ -
ఆగమనంతో ఆరంభం
జన జీవితంలో క్రొత్త ఆశల సంరంభం.
అలా వచ్చి పోయే ఉగాది పర్వం
ప్రతి ఏడాది అందిస్తుంది వినూత్న అనుభవం.

అంతేకాదు -
ప్రతి యుగాది తన వెంట తెస్తుంది
లేచివురుల స్పర్శించిన మావితరువు పులకింతలు
తద్రుచుల గ్రోలిన కోయిల కల రవములు

ఇంకా ఈ శుభకృతు ఉగాది -
గతేడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు
సుతారంగా అంటుతుంది మరుపు లేపనం
అందిస్తుంది గాయపడిన చిత్తాలకు స్వాంతనం

అయినా -
ఆశావహులకు మాత్రం అన్ని వేళలా ఉగాదే.
ప్రతి పర్వం తీపి పండుగే.
అందుకే మళ్ళీ వచ్చే ఉగాది అలరించడానికి ప్రతి హృదిని.
అందరికీ అందిస్తోంది శుభకృతు నామ సంవత్సర శుభాకాంక్షలు!

Posted in April 2022, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!