Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

ఉపోధ్ఘాతం :

పంచపది అనేది నూతన చిరు కవితా సాహిత్య ప్రక్రియ. పంచపది సృష్టి కర్త శ్రీ విఠల్ కాటేగర్, తెలంగాణ.

నియమాలు :

  • పంచపదిలో 5 పాదాలు (వరుసలు) ఉంటాయి.
  • మొదటి 4 పాదాల (వరుసల) అంత్య ప్రాస ఉంటుంది.
  • ప్రతి పాదములో 4 నుంచి 5 పదాల వరకూ ఉండవచ్చును.
  • 5 వ పాదము పై నాలుగు పాదాలకూ ముక్తాయింపుగా ఉండాలి.
  • 5 వ పాదములో అంత్య ప్రాస అవసరం లేదు.
  • 5 వ పాదము చివర రచయిత నామధేయముతో ముగియాలి.
  • పంచపది ఎటువంటి అంశమునైనా ఎంపిక చేసుకుని వ్రాయ వచ్చును.

సత్యా!...పంచపదులు

పంచపదులు : 01/04/22
శీర్షిక : సత్యా! పంచపదులు

పంచపదుల సంఖ్య : 3
అంశము : కుటుంబము

1.
నిన్ను నిన్నుగా అర్థంచేసుకునేవారు,
నీతోడిదే లోకమని అనుకునేవారు,
ప్రేమానురాగాలను కురిపించేవారు,
పరస్పరభావనను పెంపొందించేవారు,
కుటుంబ సభ్యులేనని తెలుసుకో సత్యా!
2.
బంధాల విలువలను తెలియపరిచేది,
అనుబంధాలను బలపరచేది,
కలిసుంటే కలదు సుఖమనిపించేది,
ఐకమత్యమే బలమని వెల్లడించేది,
కుటుంబమన్నది తెలుసుకో సత్యా!
3.
సమస్యలలో సలహా ఇచ్చేవారు,
తరుణోపాయాలు చూపేవారు,
కష్టాలలో విడువక కలిసుండేవారు,
సాంత్వన పరచి ధైర్యం చెప్పేవారు,
అమ్మానాన్నేనని గ్రహించు సత్యా!

వచ్చే నెల మరి కొన్ని పంచ పదులతో కలుద్దామా మరి!

*** సశేషం ***

Posted in April 2022, సాహిత్యం

2 Comments

  1. ఎస్.ఎల్. రాజేష్

    సినారె గారు ప్రపంచ పదులు రాసినారు
    విఠల్ గారు పంచ పది గా రూపు దిద్దినారు
    వర్ధమాన కవులకు ఉత్సాహము నింపినారు
    ఈ ప్రక్రియ అందరికీ చేరాలని సత్య సంకల్పించారు ఆమె కృషి బహు ప్రశంసనీయం రాజేష్

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!