Menu Close
mg

నేల తల్లి గుండెలో...

ఈ ప్రకృతిలో స్వరాలతో మంచి ఉల్లాసాన్నిచ్చే మధురమైన పాట విన్నప్పుడు సకల చరాచరం స్పందిస్తుంది. మనుషులకైతే మన ప్రమేయం లేకుండానే ఆనందంగా నాట్యం చేయడం ఆరంభిస్తాము. అటువంటి మంచి  సంగీత భరితమైన పాట అంతా ప్రకృతి వర్ణనలతో ఉంటె దానికి RP పట్నాయక్ వంటి వ్యక్తి స్వరకల్పన చేస్తే ఆ పాట మధురమైన, ఉత్తేజపూరిత పాట కాక మరేమిటి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఉగాది రోజున ఆ పాటను వింటూ ఉల్లాసంతో నేర్చుకుందాం.

చిత్రం: ఔనన్నా కాదన్నా
గేయ రచన: కులశేఖర్
స్వరకల్పన: ఆర్.పి.పట్నాయక్
పాడినవారు: శంకర్ మహదేవన్

నేల తల్లి గుండెలో...
నేల తల్లి గుండెలో...
ఎన్ని వేల పాటలో...
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
ఊరి జనం ఊగేలా నాగస్వరం ఊదాల
మద్దిల దరువెయ్యాలా తుళ్ళి పడేలా
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా

ఈ పల్లె పదాలే నోరారా అనాలి
తప్పెట్లే పడాలి రాగానికి
జాబిళ్ళి వినాలి నేలకదే దిగాలి జజ్జినకడి జనారే తాళానికి
వానమ్మ చిందేసి ఆడాలిరా వెన్నెల్లో గోదారి వెల్లువయ్యేలా
కొండమ్మ కోనమ్మ మోగాలిరా ఈ గాలి ఈ నేల పల్లవయ్యేలా
తప్పెటలే మోగాల ఉప్పెనలే రేగాల పాట విని పల్లెమ్మ వెంట పడాల
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా

ఊరంతా వినాలి అబ్బబ్బో అనాలి కానుకలే ఇవ్వాలి ఈ పాటకి
చిన్నారి చకోరి వాలు కళ్ళు వయ్యారి వెంట మరి పడాలి సయ్యాటకి
ఈ బుజ్జి భూగోళం ఊగాలిరా
పాపాయిలా పాట ఉయ్యాలలో
పైనున్న ఆకాశం వంగాలిరా
తాతయ్యలా ఈడు తైతక్కలో
మూల నున్న అమ్మమ్మ
మూడుకాళ్ళ ముసలమ్మ
పాట విని రోజంతా చిందులెయ్యాలా
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా

Posted in April 2022, పాటలు