తెలుగు దోహాలు
- ప్రకృతి వనరులు వ్యర్థ పరచి, తిరిగి పొందుట కుదరదు!
గడచిపోయిన సమయమెపుడు, మరలి వెనుకకు కదలదు!! - స్వాభిమానమును విడిచితే, బ్రతుకునకర్థముండదు!
ఆధునికతకు భాష్యముగా, వికృత చేష్టే ఇమడదు!! - మంచి వారితో చెలిమియొక, వాడని విరుల గుచ్ఛము,
చెడు సహవాసము విడకుంటే, మిగులు బ్రతుకున ఖేదము! - పరులను చులకన పరచితే, కోల్పోదువు గౌరవము,
ఆత్మ గౌరవమే మనిషికి, అమూల్య ఆభూషణము! - శత్రువుపై గెలుపుకొరకై, ఆయుధములను ధరించు,
ద్వేష రక్కసి తరుముటకై, ప్రేమ జ్యొతి వెలిగించు! - జటిల కార్య సాధనకొరకు, కావలె నేర్పరితనము,
కఠినత్వమును బాపునదగు, ఔషధమే మృదుత్వము! - అసందర్భపు ప్రేలాపన, తప్పక తెచ్చు బాధలు,
వాక్కు సుద్ధి కలిగియుంటే, దరికి రావు సమస్యలు! - పెద్దల అనుభవమ్ములతో, సుఖమౌ బ్రతుకు పయనము,
అనాథలను ఆదరించిన, సఫలమగును జీవితము! - చేదు జ్ఞాపకాల పుటపై, గీయకు బ్రతుకు చిత్రము,
తీపి గురుతుల మేళనతో, జీవితమౌ విశిష్టము!