Menu Close
Pillalamarri-Krishnakumar
సనాతన ధర్మం – దాని మూలాలు – సామర్ధ్య విలువలు
పిల్లలమఱ్ఱి కృష్ణకుమారు

నిన్న ఉదయనిధి స్టాలిన్ - తమిళనాడు యువ కార్య మంత్రి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చాడు. ముస్లిములు, ఆంగ్లేయులు 1400 సంవత్సరాలు ప్రయత్నించినా చెయ్యలేని పనిని వీళ్ళు చేస్తారా?

భారత్ ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చాలవు. ఎందుకంటే, 70, 80 శాతం హిందువులున్నా, అందరికీ 'నేను ఎందుకు హిందువుని?' అన్న మాటకి సమాధానం తెలియదు. మీరు మీ స్నేహితులతో మాట్లాడినప్పుడు చెప్పడానికి 'సనాతన ధర్మం' అంటే ఏమిటి? అనే మాటకి అర్థం తెలుసుకోండి. అది ఏనాటికి నిర్మూలింపబడదు అని ఎందుకు అంటారో కూడా తెలుసుకుందాం. మిత్రులు నిత్యానంద మిశ్రా ఈ విషయం గురించి కొంత  చెప్పారు.

'సనాతన' అన్న మాట సంస్కృతంలో రెండు మాటల సమాసం. సనా+తన .

సనా = ఎల్ల వేళల, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో. For Ever అనే అర్థం తీసుకోవాలి (అన్ని ప్రదేశాలలో అని కూడా అర్థం) That which exists at all times.

తన = ఉండునది,

రెండూ కలిపి అన్ని కాలాలలో ఉండేది అని అర్థం. - 'సనాభవ ఇతి సనాతన'.

ఇలాగే  'పురాతన' -  పురా+తన అంటే పాత కాలం నించి ఉండేది; ఉన్నది అని అర్థం.

ఇలాగే 'అద్యతన ' అంటే ఆద్య +తన - ఇవాళ్టి రోజున ఉండేది; ఇప్పుడు అని అర్థం

మనం సులభంగా అర్థం చేసుకోవడానికి మనకి సామాన్యంగా వినిపించే శ్లోకాలు చెప్పుకుంటే సులభంగా అర్థం అవుతుంది.

" సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్ సత్యమప్రియం; ప్రియం చ నానృతం బ్రూయాత్; ఏష ధర్మస్సనాతనః".

అంటే “సత్యం చెప్పండి, ప్రియం చెప్పండి, సత్యాన్ని అప్రియంగా చెప్పకండి; ప్రియముగా నైనా అసత్యం చెప్పకండి. ఇదే సనాతన ధర్మం" అని. దీంట్లో ఎవరికి కష్టం/నష్టం కలిగించేది ఉన్నది? దీన్ని నిర్మూలించేది ఎలా? కుదరదు.

ఇప్పుడు క్లుప్తంగా ధర్మం అంటే ఏమిటో చూద్దాం.

"ధృతి క్షమా దమోస్తేయం శ్ఔచమింద్రియ నిగ్రహం; ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం"

ధృతి = patience క్షమా = Forbearance దమ = Control అస్తేయ = Not stealing, సౌచం = Leading a pious life, ఇంద్రియ నిగ్రహం= control of senses, ధీ = బుద్ధి (applying sense of discrimination), విద్యా = learning, సత్యం = truth, అక్రోధ: = absence of  anger - ఈ పది లక్షణాలు ధర్మ లక్షణాలు.

ఇవీ ధర్మం అంటే. వీటిల్లో దేనిని నిర్మూలిస్తారు? ఎలా నిర్మూలిస్తారు? ఏది మనకి అక్కరలేదు?

ఇంకో మాట ఏమిటంటే, ధర్మం అంటే మతం(Religion) కాదు! ఈ పొరపాటు వల్లనే ఉదయనిధి వంటి మూర్ఖులు హిందూ మతంకి, ధర్మానికి ముడిపెట్టి, తికమకలవుతుంటారు.

First, Let us ensure we all know Dharma is NOT EQUAL to Religion. ఇంతేకాదు; ధర్మం అనే మాటకి రాజీవ్ మల్హోత్రా తన Sanskrit Non Translatables అనే పుస్తకంలో 22 ఆంగ్ల పదాలు చూపించారు. ఆంగ్ల నిఘంటువులు చూస్తే చాలా కనబడతాయి. కొన్నైనా చూద్దాం.

Here I am switching to English to help young Hindus who don’t read Telugu. Parents may help their children get hold of this article and read it.

The meaning of Dharma depends on its CONTEXT; in fact, the entire Hindu thought, and philosophy is entirely contextual, depends on who is doing what to whom and when and under what circumstances. All our texts are contextualized - I offer one example as 'phalaSRuti' where every prayer is contextualized to the person praying giving him what he can expect if he prays. When applied to the Dharma, Monier Williams dictionary gives - Conduct, duty, right, justice, virtue, morality, religion, religious merit, good work according to a right or rule, law, way, essential way, character, morality, bear, support, etc. You get the point.  How can any of these qualities be eradicated as Udayanidhi Stalin wants? Instead of any standard definitions, Stalin has chosen to give his own wacky definition and then derided Dharmam.

ఈ కాస్త రాసినంత మాత్రాన ధర్మం గురించి అంతా చెప్పినట్లు కాదు. కొంచెమైనా తెలుసుకుంటే ఉదయనిధి వంటి మూర్ఖులకి వెంటనే ధైర్యంగా సమాధానం చెప్పచ్చు. అప్పుడు మీకు అర్థం అవుతుంది - వాడికి, వాడి లాంటి వాళ్లకి మీకు తెలిసినంత కూడా తెలియదని. వాళ్ళని ఎదిరించండి. అది మీ ధర్మం!

గమనిక: పై వాక్యాలు పూర్తిగా రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమె. అందుకు వారే పూర్తిగా బాధ్యులు. సిరిమల్లె సంపాదకులకు ఎటువంటి సంబంధం లేదు.

****************

Posted in November 2023, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!