Menu Close
mg
Song

నిజంగా నేనేనా

యుక్త వయస్సులో ప్రేమికుల మధ్యన జనించిన ఆకర్షణ కేవలం ఆకర్షణ గానే ఉంటుందా లేక అది హృదయాంతరాళాల వరకు చేరి నిజమైన ప్రేమగా ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవితాన్ని కొనసాగించే స్థాయికి చేరుతుందా అనేది నేటికాలంలో ఖచ్చితంగా నిర్ణయించేది ఆ ప్రేమకు పంచుకున్న ప్రేమికులు మాత్రమె. ఆ ప్రేమ మరింత పవిత్రతతో ఇరువురి మనసులతో ముడిపడినప్పుడు, ఒకరి గురించి మరొకరు ఆలోచించే సమయంలో వారి మధ్యన చిగురించే భావాలకు అక్షర రూపం కల్పిస్తే ఈ క్రింది పాటగా మారుతుంది. అనంత శ్రీరాం ఆ భావాలను తన పదాల పొందికతో చక్కగా చూపించారు. ఇంకెందుకు ఆలస్యం మరి మనం కూడా ఆ ప్రేమ సన్నివేశాలను పాట రూపంలో చూసేద్దాం పదండి.

movie

కొత్త బంగారు లోకం (2008)

music

అనంత శ్రీరాం

music

మిక్కి జే మేయర్

microphone

కార్తీక్


నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోన ఏమ్మా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకే ప్రతీ క్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడిచిన కాలం ఎంతని నమ్మనుగా

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
పెదవికి చెంప తగిలిన చోట
పరవశమేదో తోడవుతుంటే
పగలే అయినా గగనంలోన తారలు చేరెనుగా

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోన ఏమ్మా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా

Posted in November 2023, పాటలు