Menu Close
Kadambam Page Title
పల్లె పిలుస్తోంది...!
గవిడి శ్రీనివాస్

చిగురుటాకుల్లో వెన్నెల చూపుల్లో తడిసి
లేలేత గాలులతో మురిసి
పల్లె నిండుగా పులకరిస్తోంది.

చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూ
ముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి.

ఆరుబయట అట్లానే
చిరు నవ్వులు వేచివున్నాయి.

పల్లెతనం అమ్మతనం ఎంచక్కా
ఆప్యాయంగా నిమురుతున్నాయి.

వేసవి అయితే చాలు
పిల్లలు పల్లె కు రెక్కలు కట్టుకుని
ఎగురుతున్నారు.

మామిడి చెట్ల నీడలో
జీడి చెట్ల కొమ్మల్లో
అడుగులు వడివడిగా
మురిసి పోతున్నాయి.

మట్టి పరిమళాల్ని అద్దుకుని
మంచు బిందువుల్ని పూసుకుని
ఎగిరే పక్షుల వెంట
ఆనందాలు సాగిపోతున్నాయి.

కరిగిపోతున్న కలల్ని ఎత్తుకుని
నా పల్లె లో వాలిపోతాను.

దోసిళ్ళలో చిరు నవ్వుల్ని
వెలిగించుకుని
అలసిన క్షణాల నుంచీ
అలా సేదదీరుతుంటాను.

Posted in October 2023, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *