Menu Close
mg
Song

ఓం నమో శివ రుద్రాయ

త్రిమూర్తులలో గాని, మిగిలిన దేవతామూర్తులలో ఆ సదాశివుడు అత్యంత సాధారణ భోళాశంకరుడు గా ప్రసిద్ధి. ఆయన ఆహార్యాన్ని, అలవాట్లను కీర్తించడం అత్యంత సులువు. ఎందుకు అంటే ఆయన నిరాడంబరుడు. ఎవరికైననూ ఆయనను స్తుతించేందుకు ఎన్నో సరళమైన పదాలు లభిస్తాయి. – ఈడు జంగమ శంకర శివుడేను రా, నీ తాపం శాపం తీర్చెవాడేరా అని అవలీలగా ఆయనను ప్రస్తుతించవచ్చు. ఆ రుద్రుని గురించి వ్రాసిన ఈ పాట సృష్టి కర్త రామజోగయ్య శాస్త్రి. నాకు అత్యంత ఇష్టమైన పాటలలో ఇది ఒకటి. ఇప్పటికీ ఆ పాటను నేర్చుకొని రాగయుక్తంగా పాడాలని కోరిక. ప్రస్తుతానికి, కారుణ్య, రమేష్ తమ గళంలో పలికించిన ఆ మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం.

movie

ఖలేజా (2010)

music

రామజోగయ్య శాస్త్రి

music

మణిశర్మ

microphone

కారుణ్య, రమేష్


ఓం నమో శివ రుద్రాయ – ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగా భరణాయ – ప్రణవాయ డమ డమ డమరుఖ నాధా నందాయ
ఓం నమో నిటలాక్షాయ – ఓం నమో భస్మాంగాయ
ఓం నమో హిమశైలావరణాయ – ప్రమథాయ ధిమి ధిమి తాండవ ఖేళీ లోలాయా
సదా శివా సన్యాసి తాపసి కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లె కాశి
యె చూపుల చుక్కాని దారిగా – చుక్కల తివాచి మీదిగా
చూడ చక్కని సామి దిగినాడు రా – యేసెయిరా వూరూ వాడా దండోరా
యే రంగుల హంగుల పొడ లేదు రా – ఈడు జంగమ శంకర శివుడేను రా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా – నీ తాపం శాపం తీర్చెవాడేరా
పైపైకలా బైరాగిలా వుంటాది రా ఆ లీల
లోకాలనేలేటోడూ నీకు సాయం కాకపోడూ
యె నీలోనె కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడూ

om namahshiva jai jai jai
om namahshiva jai jai jai
om namahshiva go to the trance
and say jai jai jai
sing along and sing shiva
shambo all the way
om namahshiva jai jai jai
heal the world is all we pray
save our lives and take
our pain away jai jai jai
sing along and sing shiva
shambo all the way

సదా శివ సన్యాసి తాపసీ కైలాసవాసి
నీ పాదముద్రలు మోసి పొంగిపొయినాది పల్లె కాసి
యె ఎక్కడ వీడుంటే నిండుగా – అక్కడ నేలంతా పండుగా
చుట్టు పక్కల చీకటి పెల్లగించగా – అడుగేశాడంటా కాచే దొరలాగా
మంచును మంటను ఒక తీరుగా – లెక్క సెయనె సెయ్యనీ శంకరయ్యగా
ఉక్కు కంచెగా వూపిరి నిలిపాడురా – మనకండా దండా వీడె నికరంగా
సామీ అంటె హామి తానై వుంటాడురా చివరంటా
లొకాలనేలే తోడు నీకు సాయం కాకపోడూ
యె నీలోనె కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడు

om namahshiva jai jai jai
om namahshiva jai jai jai
om namahshiva go to the trance
and say jai jai jai
sing along and sing shiva
shambo all the way
om namahshiva jai jai jai
heal the world is all we pray
save our lives and take
our pain away jai jai jai
sing along and sing shiva
shambo all the way

Posted in October 2023, పాటలు