నువ్వు నా ప్రేయసి కాదు.
నా నిత్యకృత్యం మొదలు నీతోనే
నిన్నే చూస్తూ నీలోనే చూస్తూ ఉంటాను.
నా మదిలో ఎప్పుడూ నువ్వే
నా ఊహల్లో నా ధ్యాస లో ఎప్పుడూ నువ్వే
కలలో నువ్వే ఇలలో నువ్వే
నీతోనే ఉంటా, నీతోనే తింటా, నీతోనే నిదురిస్తా
కానీ నువ్వు నా ప్రేయసి కాదు.
నాతో ఎప్పుడూ, నా గుండెల మీద ఎపుడూ
తనివి తీరదు కాలం తెలియదు నిన్ను చూస్తే
ఆకలి తెలియదు దాహం తెలియదు నువ్వుంటే
ఎప్పటికప్పుడు నీ అందం ద్విగుణీకృతం
అది సొంతమైతే నా మది మధురామృతం
కానీ నువ్వు నా ప్రేయసి కాదు.
నువ్వే నా ప్రపంచం నీతోనే ఆట, నీతోనే పాట
నీ తోడే నాకు సయ్యాట
నువ్వు చెంతనుంటే ఎద పులకరింత
క్షణం దూరమైతే మది కలవరింత
నీ మాటే వేదవాక్కు
నీ మౌనం విరహగీతం
కానీ నువ్వు నా ప్రేయసి కాదు.
నీ బాగోగులు చూసుకునే పాలకుడిని
నిను వెన్నంటి వుండే రక్షకుడను
నీ సేవలో తరించే నీ సేవకుడను
నిన్నటి జ్ఞాపకాలు నీవే
నేటి ఆలోచనలు నీ గురించే
రేపటి ప్రణాళికలు నీతోనే
కానీ నువ్వు నా ప్రేయసి కాదు
నువ్వు నా రాణి, నువ్వే నా వాణి, నువ్వే నా చరవాణి!!!
Thank you Supraja garu.
వర్తమాన కాలానికి అద్దం పట్టిన కవిత. చాలా బాగుంది.
ధన్యవాదాలు కిరణ్ గారు నా కవిత మీకు నచ్చినందుకు.
baagundi…mee mobile kavitha…nijame kadaa…
Thank you Raji garu
Baagundi mee kavitha mobile meeda. Baaga chepparu.
Thank you .. meeku nachinanduku
Nice