Menu Close
Lalitha-Sahasranamam-PR page title

షోడశోధ్యాయం

(శ్రీమాత విరాడ్రూప షోడశకళల వర్ణన)

శ్లోకాలు: 137-152/1, సహస్రనామాలు: 701-800

732. ఓం నామపారాయణ ప్రీతాయై నమః
నామపారాయణ చేసిన వారియందు ప్రీతికలిగి అనుగ్రహించునట్టి మాతకు వందనాలు.


733. ఓం నందివిద్యాయై నమః
నందీశ్వరునిచే ఉపాసింపబడిన మహావిద్యా స్వరూపిణికి ప్రణామాలు.


734. ఓం నటేశ్వర్యై నమః
నటరాజసతికి ప్రణామాలు.


735. ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః
అసత్యం రూపమైన విశ్వానికి అధిష్టానరూపిణియైన తల్లికి ప్రణామాలు.


736. ఓం ముక్తిదాయై నమః
మోక్షాన్ని ప్రసాదించు జననికి వందనాలు.


737. ఓం ముక్తిరూపిణ్యై నమః
ముక్తియే స్వరూపంగా గల మాతకు ప్రణామాలు.


738. ఓం లాస్యప్రియాయై నమః
లాస్యమందు విశేష ప్రీతి గల మాతకు నమస్కారాలు.


739. ఓం లయకర్యై నమః
నాట్యగాన తాళాలు సక్రమంగా ఉండుటకు లయమని పేరు. --అట్టిలయాన్ని చేయగల తల్లికి వందనాలు.


740. ఓం లజ్జాయై నమః
లజ్జా స్వరూపంలో భాసిల్లు మాతకు ప్రణామాలు.


741. ఓం రంభాదివందితాయై నమః
రంభాద్యప్సరః కాంతలచే వందనాలందు కొనునట్టి తల్లికి వందనాలు.


742. ఓం భవదావసుధావృష్ట్యై నమః
భవరూపమైన దావానంలో అమృతాన్ని వర్షింపజేయునట్టి మాతకు ప్రణామాలు.


743. ఓం పాపారణ్య దవానలాయై నమః
పాపారూపారణ్య దావానలం వంటి మాతృమూర్తికి వందనాలు.


744. ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః
దౌర్భాగ్య రూపమైన శుష్కగ్రాసాన్ని ఎగురగొట్టివేయునట్టి ఝంఝూమారుత రూపిణికి ప్రణామాలు.


745. ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః
ముసలితనమనే అంధకారాన్ని రూపుమాపడానికి అనంతప్రభలతో భాసిల్లునట్టి సూర్య స్వరూపిణికి ప్రణామాలు.


746. ఓం భాగ్యాబ్ధిచంద్రికాయై నమః
భాగ్యరూప సాగరానికి చంద్రికా స్వరూపిణియైన మాతకు ప్రణామాలు.


747. ఓం భక్త చిత్తకేకి ఘనాఘనాయై నమః
భక్తజనుల చిత్తరూపమైన మయూరాన్ని ఆనందపరచునట్టి మేఘజాలరూపిణి అయిన మాతకు ప్రణామాలు.


748. ఓం రోగపర్వత దంభోళయే నమః
రోగరూప పర్వతాలకు వజ్రస్వరూపిణి అయిన మాతకు ప్రణామాలు.


749. ఓం మృత్యుదారు కుఠారికాయై నమః
మృత్యురూప కాష్టాలను ఖండించుటకు నిశితపరశువువంటి జననికి నమస్కారాలు.


750. ఓం మహేశ్వర్యై నమః
మహేశ్వరీమూర్తికి ప్రణామాలు.


751. ఓం మహాకాళ్యై నమః
మహత్తరమైన మహిమలు కల మహాకాళీ రూపిణికి నమోవాకాలు.


752. ఓం మహాగ్రాసాయై నమః
మహత్తరమైన, అపరిమితమైన ఆహారమును స్వీకరించు తల్లికి ప్రణామాలు.


753. ఓం మహాశనాయై నమః
చరాచర విశ్వమే ఆశనముగా గల మాతకు ప్రణామాలు.


754. ఓం అపర్ణాయై నమః
పరమశివునికై పత్రాలను కూడా త్యజించి తపస్సుచేసిన అపర్ణాదేవికి నమస్కారాలు.


755. ఓం చండికాయై నమః
నాస్తికులు యందు, భక్తిహీనులయందు క్రోధాన్ని చూపునట్టి చండికాదేవికి వందనాలు.


756. ఓం చండముండాసుర నిషూదిన్యై నమః
చండముండాది క్రూర రాక్షసులను సంహరించిన మాతకు ప్రణామాలు.


757. ఓం క్షరాక్షరాత్మికాయై నమః
క్షరస్వరూపిణియుతానై, అక్షరస్వరూపిణియుతానై భాసిల్లునట్టి మాతకు నమస్కారాలు.


758. ఓం సర్వలోకేశ్య నమః
సర్వలోకాలకూ శాసకురాలైన మహేశ్వరికి వందనాలు.


759. ఓం విశ్వధారిణ్యై నమః
విశ్వాలను అన్నింటినీ ధరించు మహామాతకు వినయాంజలులు.

----సశేషం----

Posted in April 2024, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!