Menu Close
Lalitha-Sahasranamam-PR page title

షోడశోధ్యాయం

(శ్రీమాత విరాడ్రూప షోడశకళల వర్ణన)

శ్లోకాలు: 137-152/1, సహస్రనామాలు: 701-800

701. ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః
దేశకాలాదులచే పరిచ్ఛిన్నురాలు కాని అపరిఛిన్న శక్తికి వందనాలు.


702. ఓం సర్వగాయై నమః
యావద్విశ్వంలోని చరాచరాలలో సంచరించునట్టి మహాశక్తికి ప్రణామాలు.


703. ఓం సర్వమోహిన్యై నమః
అందరినీ మోహింపజేయునట్టి మహా మోహనమూర్తికి ప్రణామాలు.


704. ఓం సరస్వత్యై నమః
సుజ్ఞానమూర్తికి, సర్వవిద్యా స్వరూపిణియైన చదువులనెల్లను ప్రసాదించు సరస్వతీ మాతకు వందనాలు.


705. ఓం శాస్త్రమయ్యై నమః
సర్వశాస్త్రలే స్వరూపంగా గల దేవికి ప్రణామాలు.


706. ఓం గుహ్యంబాయై నమః
హృదయరూప గుహలో రహస్యంగా ఉండునది. గుహుడు--అంటే కుమారస్వామికి అంబ అయిన దేవికి ప్రణామాలు.


707. ఓం గుహ్యరూపిణ్యై నమః
అత్యంత రహస్యమైన పరమరహస్యా ద్వైతరూపంగల మాతకు కైమోడ్పులు.


708. ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః
ఉపాధులేవి లేని సమస్తమైన ఉపాధులచేతనూ ముక్తురాలైన మాతకు నమస్కారాలు.


709. ఓం సదాశివ పతివ్రతాయై నమః
సదాశివదేవుని సతియై మహాపతివ్రతగా విశ్వవిఖ్యాతి గాంచు మాతకు నమస్కారాలు.



710. ఓం సంప్రదాయేశ్వర్యై నమః

సకల సంప్రదాయాలను శాసించు మాతకు నమస్కారాలు.


711. ఓం సాధవే నమః
సాధ్వీమ తల్లికి ప్రణామాలు.


712. ఓం ఈ నమః
కామకళా సంజ్ఞకమై ‘ఈ’ బీజాక్షర స్వరూపిణియైన పరమేశ్వరికి వందనాలు.


713. ఓం గురుమండలరూపిణ్యై నమః
పరమశివుడాదిగా-- మంత్రోపదేశం చేసిన గురుదేవునివరకూ గల ఏ గురుమండలములతో ఉన్నదో ఆ గురుమండల సర్వస్వ స్వరూపిణికి ప్రణామాలు.


714. ఓం కులోత్తీర్ణాయై నమః
కులోత్తీర్ణ స్వరూపిణియైన మాతకు వందనాలు.


715. ఓం భగారాధ్యాయై నమః
సూర్యమండలంలో ధ్యానించి ఆరాధించదగిన జననికి ప్రణామాలు.


716. ఓం మాయాయై నమః
మాయాశక్తి స్వరూపిణియగు మాతకు నమస్కారాలు.


717. ఓం మధుమత్యై నమః
మధురమైన మతి గల మాతకు ప్రణామాలు.


718. ఓం మహ్యై నమః
మహీరూపిణికీవందనాలు.


719. ఓం గణంబాయై నమః
సర్వగణాలకూ మాతృమూర్తి యైన మహామాతకు వందనాలు.


720. ఓం గుహ్యకారాధ్యాయై నమః
గుహ్యకులు--అనే దేవతలచే ఆరాధించబడిన మాతకు నమస్కారాలు.


721. ఓం కోమలాంగ్యై నమః
కోమలమైన అంగాలు కల తల్లికి వందనాలు.


722. ఓం గురుప్రియాయై నమః
విశ్వాలకే గురువైన మహాదేవునియందు ప్రియము కల తల్లికి వందనాలు.


723. ఓం స్వతంత్రాయై నమః
సర్వతంత్ర స్వతంత్రురాలైన మాతకు నమస్కారాలు.


724. ఓం సర్వతంత్రెశ్యై నమః
సర్వతంత్ర స్వరూపిణికి ప్రణామాలు.


725. ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః
సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపిణిగా భాసిల్లే మాతకు ప్రణామాలు.


726. ఓం సనకాది సమారాధ్యాయై నమః
సనకాది దివ్యర్షులచే కూడా ఆరాధింపబడిన మాతకు ప్రణామాలు.


727. ఓం శివజ్ఞాన ప్రదాయిన్యై నమః
పరమశివ సంబంధమైన జ్ఞాన విషయాలను ప్రసాదించునట్టి తల్లికి వందనాలు.


728. ఓం చిత్కళాయై నమః
చైతన్య కళామయ మూర్తికి వందనాలు.


729. ఓం ఆనందకలికాయై నమః
పరబ్రహ్మాంశా స్వరూపంమైన ఆనందకళా స్వరూపిణికి వందనాలు.


730. ఓం ప్రేమరూపాయై నమః
ప్రేమయే స్వరూపంగాగల దేవికి నమస్కారాలు.


731. ఓం ప్రియంకర్యై నమః
ప్రియాన్ని కలుగజేయునట్టి మాతకు ప్రణామాలు.

----సశేషం----

Posted in March 2024, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!