Menu Close
mg
- మధు బుడమగుంట -
Song

కళ్ళజోడు కాలేజీ పాప జూడు

మన తెలుగు పాటలలో కొన్నిసార్లు వేగవంతమైన రాగాలతో స్వరకల్పన చాలా గమ్మత్తుగా ఉండి అందులో బాషాపరంగా నిగూఢమైన భావనలు ఏవీ లేకున్ననూ పాట ఎంతో వినసొంపుగా ఉండి ఎక్కువమంది ఇష్టపడటం జరుగుతుంది. కొన్ని చిత్రాలు అందులో చిత్రీకరించిన పాటల వలన మంచి పేరును సంపాదించుకొంటాయి. లక్షల మంది వీక్షించి జేజేలు పలికిన అటువంటి పాట ఒకటి 2023 సంవత్సరంలో విడుదల అయిన MAD అనే చిత్రంలోనిది నాకు కూడా నచ్చి మీ అందరికోసం ఈ నెల అందిస్తున్నాను.

movie

MAD (2023)

music

శ్యాం కాసర్ల

music

భీమ్స్

microphone

భీమ్స్, కీర్తన, వరం


హే, కళ్ళజోడు కాలేజీ పాప జూడు
ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు
ఎర్రరోజా పువ్వు సేతికిచ్చి జూడు
అందరిముందు ఐ లవ్ యూ సెప్పిజూడు

అరె పడితె లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోతొస్తది

హే నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి
అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోతొస్తది

హీరో హోండా బండి మీద పోరడు జూడు
కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు
షారుక్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తడాడు
రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు

అరె ఓకే అని అంటిమా, ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
(ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు)

అరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడు
ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగ మీ యెనకబడితే ఫోజిస్తారు
స్టేటసులో సింగల్ అని పెట్టేస్తారు
లవ్వరు ఉన్నదాని ఫ్రెండును ట్రై చేస్తారు

నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు

ఆ, ఎడ్డీ పోరల్ల చేసి ఆడిపిస్తరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరీర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరీర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు

హే ఫస్ట్ లవ్ ఎప్పుడూ బెస్ట్ జూడు
ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు
లిప్ ఆన్ లిప్ టైపు లవ్ వదిలి చూడు
బ్రేక్ అప్ అయితే ఎవ్వరికైనా నొప్పే సూడు

ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా
లవ్ చేస్తే లైఫ్ లో అస్సలొదులుకోకురా
ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా
లవ్ చేస్తే లైఫ్ లో అస్సలొదులుకోకురా
హే సోది సెప్పకుండా సోల్ మేట్ కొరకు ఎదుకురా
ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా
లవ్ చేస్తే లైఫ్ లో అస్సలొదులు కోకురా
ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా
లవ్ చేస్తే లైఫ్ లో అస్సలొదులు కోకురా

Posted in March 2024, పాటలు