Menu Close
Page Title

సంగీతం పై సాహిత్య ప్రభావం

Adibhatla-Narayana-Dasuవాగ్గేయకారుడు తన సంగీత జ్ఞానాన్నీ, అకుంఠిత సాధనతో ఆర్జించిన గాత్ర ప్రావిణ్యాన్నీ తన సాహిత్య ప్రతిభతో జోడించి తన గానంతో మధురిమను జాలువారుస్తూ రసజ్ఞుల్ని, పండిత పామరులని తానొక్కడే సర్వం అయి మెప్పిస్తాడు. సంగీత రసపిపాసకుల హృదయ పొరలలో వారి గమక చమత్కృతులతో సుగంధాలు విరజిమ్ముతూ అవి కల కాలం నిలిచేవి. దానికి భిన్నంగా హరికథా కోవిదుడు నృత్య, సంగీత, సాహిత్యాలని చతురోక్తులతో హాస్య సంభాషణలతోను మేళవించి ‘హరికథ’ అనే ఒక విశిష్ట కళారూపాన్నీ ఆవిష్కరిస్తాడు. దాదాపు మూడు ఘంటల నిడివిలో ఒకే కళాకారుడు శ్రోతల ధ్యాస మళ్ళకుండా శృతి బద్ధంగా తగినరీతిని పాటలు, పద్యాలు పాడుతూ పట్టు పంచ ధరించి, పట్టుఖండువా నడుముకి చుట్టి, మెడలో పూలమాలధరించి, చేతిలో చిరుతలతో, కాలికి గజ్జలతో తగిన రీతిని మృదువుగా నర్తిస్తూ వేదిక అంతా తానొక్కడే పాత్రధారి అయి పిట్టకథలు మధ్య రక్తికట్టిస్తూ ముఖ్య కథని నడపడం దీక్షతో కూడిన అసమాన సృజనాత్మక ప్రక్రియ. నారద మహర్షి చేత ప్రారంభింపబడిన ఆ హరికథ కాలానుగుణంగా రూపులు మార్చుకుంటూ నేటికి ఈ అవతారం దాల్చింది. దానిని  అతి రమ్యంగా మలచి తెలుగు భాషలో ప్రాముఖ్యతని కలిగించిన వారు శ్రీకాకుళం బొబ్బిలి తాలూకా సువర్ణముఖీ నదీతీరాన ఉన్న’అజ్జాడ’కి చెందిన ఆదిభట్ల నారాయణ దాసు. ఆయన ప్రప్రథంగా విజయనగరంలో కానుకుర్తి హనుమంత రావు గారింట్లో శ్రీ కుప్పుస్వామి భవతారు గారు చెప్పిన "ధృవచరిత్రం" అనే కథా కాలక్షేపాన్ని చూసి ఆ కథావిష్కరణకు ముగ్దుడై దానికే మరింత మెరుగుపెట్టి తన ప్రజ్ఞా పాటవాలని జోడించి తండ్రి ద్వారా లభించిన భారత, భాగవత, పురాణాల జ్ఞానాన్ని తన లోక పరిజ్ఞానముతో పోహళించి అత్యంత జనరంజకంగా హరికథా ప్రక్రియని రూపొందించి మొదటిసారి 1883  లో వినిపించారు.. ఆ ప్రక్రియలో కథా వస్తువు ప్రతిసారి మారినా దాని పట్టు విడవకుండా చెప్పిన విషయం తిరిగి చెప్పకుండా రసపట్టు తప్పిపోకుండా సాధించడము పండిపామరులను ఒకే రీతిని మెప్పించడం ఒక అసమాన కళా సారధ్యమే. వారు రామాయణ, మహాభారత ఘట్టాలని నేర్పుగా ప్రేక్షకులని మెప్పించే విధంగా ఏర్చి, కూర్చి దానిని కొన్నిసమయాలలో ఒకరోజు, కొన్ని వారంరోజులు, కొన్ని పక్షంరోజులు, కొన్ని నెల్లాళ్ళు కూడా చేయడం పరిపాటి. ఆయన తండ్రి ద్వారా సంపాదించిన పాండిత్యాన్ని, తన రాగరంజిత గళంలో సంగీతాన్ని మలుపులు త్రిప్పుతూ దానిని ప్రజారంజకం చేశారు. వీణా వాద్యంలోను అసమాన జ్ఞానసముపార్జన చేసి నిష్ణాతుడనిపించుకున్నారు. అనేక యక్షగానాలని, 14 హరికథా ప్రబంధాలని లిఖించారు (అందులో మూడు సంస్కృతంలో వ్రాసినవి). వారి హరికథలు బహుళ ప్రజాదరణ పొంది, అనేక సంస్థానాల్లో నిష్ణాతుడని ప్రజ్ఞులచే సత్కారాలనే గాక, గజారోహణ, గండపెండేర సత్కారాలని (పిఠాపురం జమీందారుగారి చేత, విజయనగర మహారాజు గారి చేత, మైసూర్ మహారాజుగారి వద్ద పొంది బహుధా ప్రస్తుతింపబడ్డారు) పొంది హరికథా పితామహుడనిపించుకున్నారు. ఆయన 7 శతకాలని, 13 అచ్చ తెలుగు కృతులని, 3  ప్రబంధాలని, 2 రూపకాలని 4  గద్యకృతులని, 'నూరుగంటి ' పేరుతో నూరు కథల్ని రంచించిన గొప్ప సరస్వతీపుత్రుడు. విజయనగర మహారాజుచే స్థాపించపడిన శ్రీవిజయరామగణపతి సంగీత కళాశాలకు ప్రధమ అధ్యక్షులుగా నియమింపబడి 17 సంవత్సరాలు దానిని నడిపారు. రబీన్ద్రనాథ్ ఠాగూర్ ఆయన పాటని మెచ్చుకుంటూ బేహాగ్, భైరవి, కళ్యాణ్ రాగాలలో నారాయణదాసుని మించినవారు భారతదేశంలోనే లేరని వ్రాశారట. ‘ఆకాశవాణి’ వినిపించిన శ్రీ కొండూరి శేషాద్రి గారు పాడిన నారాయణ దాసు గారి కృతి ఇక్కడ వినవచ్చు.

నేడు అనేక స్త్రీ భగవతారిణిలు / పురుష భాగవతార్ లు ఈ కళాభివృద్ధికై ఎంతో కృషి చేస్తున్నారన్న విషయం ఎంతో ముదావహము..

Adibhatla-Narayana-Dasuబుర్రకథ అదేకోవకు చెందినదే అయినా దీనిలో పాండిత్య పటిమ కొంచము తక్కువస్థాయిలో ఉండి, సామాన్యులకు, పామరులకు జన రంజకంగా ఉండే భాషలో భాసిస్తూ పల్లెలలో ఎక్కువ ఆదరణని పొందుతోంది. దీనిలో ముగ్గురు పాత్రధారులు కథని నడిపిస్తారు. ముఖ్యపాత్రధాహరుడు తుంబురతో కథాగమనానికి బాటలు సుగమం చేస్తుండగా ప్రక్క పాత్రధారులు ఆ గమనానికి 'తందాన తానా' అంటూ హాస్య కథలతో, పిట్టకథలతో బలాన్ని చేకూరుస్తుంటారు. వీరి ప్రదర్శనలలో వీర, రౌద్ర, కరుణ, హాస్య ఆదిగాగల నవరస భరిత ఇతి వృత్తాలని కథా వస్తువుగా ఎన్నుకుని అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి యుద్ధం, బాలనాగమ్మ, రామాయణ, మహాభారత మొదలుగాగల ఇతివృత్తాలు, ప్రజాచైతన్య ప్రబోధనలతో కథలనల్లి ప్రజలలో ఉత్తేజాన్నికలిగిస్తారు.

'సెల్యూలాయిడ్' పై చలన చిత్రీకరణం ఆరంభమైన తరువాత దృశ్యకావ్యాలు మరంత జన రంజకమై అధిక ప్రాచుర్యాన్ని సంతరించుకుని వినూత్న చైత్యన్నాన్ని సృష్టించి ఇతర వినోదాత్మక సాధనాలని వెనక్కునెట్టాయి. వాటి సాంకేతికత, ప్రాచుర్యం పెరిగిన కొద్దీ నిర్మాతల కళాత్మకత వికసించి పెరుగుతూ నూతన కళాసృష్టికి దారితీసింది. సినీపరిశ్రమలో మొదటి తెలుపు-నలుపు చిత్రాల కంటే రంగుల చిత్ర నిర్మాణం జనానికి హృద్యమై అధికంగా ఆకట్టుకోగలిగింది. సినిమాలలో నూతన ప్రబంధయుగం ఆవిధంగా ఆవిష్కరించబడింది. దానిలో పాట ఆ దృశ్యకావ్యరసోత్ప్రేక్షలో ఒక  ప్రధాన పాత్ర పోషించింది. దానిని అందంగా ఆహ్లాదకరంగా మలచడానికి ఎందరో గీతకారులు, సంగీతకారులు, గాయకులు గాన మాధుర్యాన్ని అందించడానికి ఎనలేని కృషి చేస్తూ తమ ప్రతిభలని చిత్రీకరణలలో ప్రతిబింబించగలిగారు. చిక్కని ఆవుపాల మీగడపై మధువుని రంగరించినట్లున్నవాటిలో కొన్ని ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని చిరకాలం వారి మనోఫలకాలపై చెరగని ముద్రవేశాయి. ఆవిధంగా వివిధ కళాకారులలోని ప్రతిభలు ఒక్క చోట సమకూర్చి అతిరమ్యంగా చిత్రీకరించ గలుగుతున్నారు. ఇదివరకటి వాగ్గేయకారుల ఏకైక భక్తి భావ ప్రతిభోత్ప్రేక్షకు భిన్నంగా ఈ సామూహిక నవరస ప్రతిభా ప్రదర్శన ప్రజలలో ఎంతగానో రాణింపుని తెచ్చింది. వాటిలో కొన్నిటిని మనం ఇక్కడ ముచ్చటించుకుందాము.

గీతాలను విరచించిన రచయితలందరి కృషిని, వారి సువర్ణ భావ మిశ్రమాన్ని ఇక్కడ పొందుపరచడం సాధ్యం కాదు, కనుక కొందరి గేయరచయితల మధుర గానాల సమాహారం క్రింద పొందుపరచడమైనది- విని, చదివి ఆనందించగలరు. - ముందుగా ఆ పాట యొక్క దృశ్య సన్నివేశంతో పాటు అది ఏ చిత్రంలో అలరినదీ, దానికి సంగీతం సమకూర్చినవారు, పాడినవారి వివరాల సమాచారం ఇవ్వడమైనది :

అ.) సముద్రాల రాఘవాచార్య:

(చిత్రం: దొంగ రాముడు, సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు, పాడినది: ఘంటసాల, సుశీల) లింక్ »

ఓ...చిగురాకులలో చిలకమ్మా
చిన్నమాట వినరావమ్మ
ఓ...మరుమల్లెలలో మావయ్యా
మంచి మాట సెలవీవయ్యా
పున్నమి వెన్నెల గిలిగింతలకు
పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా
ఎవరన్నారో ఈ మాట
వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేనా
వలచే కోమలి వయ్యారాలకు
తలచే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ
పైమెరుగులకే భ్రమపడకయ్యా
మనసే మాయని సొగసయ్యా
గుణమే తరగని ధనమయ్యా "ఓ...మరుమల్లెలలో"


{చిత్రం:దేవదాసు (వేదాంతం రాఘవయ్య) సంగీతం: సి.ఆర్.సుబ్బురామన్; గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు} లింక్ »

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా

కలిమి లేములు కష్ట సుఖాలు
కలిమి లేములు కష్ట సుఖాలు
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి
ఆశా మోహముల దరిరానికోయి
అన్యులకే నీ సుఖము అంకితమోయి
బాధే సౌఖ్యమనే భావన రానివోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయి


{చిత్రం:దేవదాసు (వేదాంతం రాఘవయ్య) సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్, పాడినది: ఘంటసాల} లింక్ »
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్
సుడిలో దూకి ఎదురీదకా..
సుడిలో దూకి ఎదురీదక
మునకే సుఖమనుకోవోయ్

మేడలోనే అల పైడిబొమ్మా నీడనే చిలకమ్మా
కొండలే రగిలే వడగాలి. నీ సిగలో పూవేలోయ్
చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్
లాయిరీ నడిసంద్రములోన లంగరుతో పనిలేదోయ్


(చిత్రం:అమరశిల్పి జక్కన, సంగీతం: సాలూరి రాజేశ్వర రావు, పాడినది: ఘంటసాల, సుశీల) లింక్ »
నిలువుమా నిలువుమా నీలవేణి
అడుగడున ఆడే లే నడుము సొంపులా
తడబడే అడుగుల నటనల మురిపింపుల
సడిసేయక ఊరించే వయ్యారపు ఒంపుల
కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణి
నీ కనుల నీలి నీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణి

అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ
అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి
నా ఊర్వశి రావే రావేయని పిలువనా
ఆ సుందరి నెర నీకు నీగోటికి సమమౌనా
రాచెలీ నినుమదీ దాచుకోని
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణి


(చిత్రం:అనార్కలి, సంగీతం: పి.ఆదినారాయణ రావు పాడినది: ఘంటసాల, జిక్కి) లింక్ »
రాగం: హిందోళం & హిందుస్తానీ మాల్కోస్ ల మిశ్రమం

మదన మనోహర సుందర నారీ
మధుర ధరస్మిత నయన చకోరీ
మందగమన జిత రాజమరాళీ
నాట్య మయూరీ...అనార్కలీ...

రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా
ఏలరా "రాజశేఖరా"
మనసు నిలువ నీదురా
మమత మాసి పోదురా
మధురమైన బాధరా
మరుపురాదు...ఆ... "రాజశేఖరా"
కానిదాన కానురా
కనులనైన కానరా "కాని"
జాగుసేయనేలరా
వేగరావదలేరా "జాగు"
చేరరార చేరరార చేరరార


(చిత్రం:బ్రతుకు తెరువు, సంగీతం, గానం : ఘంటసాల వెంకటేశ్వర రావు) లింక్ »

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం
పడమట సంధ్యారాగం కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం జీవితమే మధురానురాగం
పడిలేచే కడలి తరంగం ఒడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటకరంగం- అందమే ఆనందం


{చిత్రం:దేవదాసు (వేదాంతం రాఘవయ్య) సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్, పాడినది: ఘంటసాల} లింక్ »

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఓ..
పసితనపు మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే
ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే
ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే వరమింతే
చివురించిన పూదేవీ విరియగా
విరితావులు దూరాలై చనేనులే ప్రేమ ఇంతేలే పరిణామమింతేలే
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరబారాలేమో
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరబారాలేమో హితవేమో
ఎది నేరని ప్రాయానా చనువునా
రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ యోగమింతేలే అనురాగమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే

-సశేషం-

Posted in March 2024, సాహిత్యం

2 Comments

  1. Venugopal Rao G

    Dear Sir,
    Thanks for the interest shown. I have mentioned the Lyricist’s name at the beginning of each group of songs. Though there are more great songs each writer had contributed, all could not be mentioned here for want of space. You will see more గీతకారుల సాహిత్య సంపద , in the future issues with their valuable contributions.

  2. Subba Rao V. Durvasula

    Sir:
    Greetings. I enjoyed reading your article. About 70 years back, when 3-5 day marriage functions were the norm, they used to have a Harikatha performance. Now, wedded to a very busy life, this is totally changed. But revival of Harikatha is taking place and needs more encouragement. In Tirupati there is a school for Harikatha. I do not know of any Burrakatha performance these days.

    You gave some excellent examples of Sahithi in film music. Please include information on the author of the song.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!