Menu Close
Kadambam Page Title
ఎండిన రైతు కలలు
గవిడి శ్రీనివాస్

కొన్నేళ్ల క్రితం అలా
రాత్రి వెన్నెల్ని మోసి అలసి పోయాను.
ఎడ్ల బండి గంతుల్ని చూసి మురిసి పోయాను.
గత్తం పొలం లో చుక్కలు గా ఎగిరింది.

తెల్లవారింది
దుక్కుదున్నటంలో మునిగిపోయాను.
నాగలి అడుగుల్లో కదిలిపోయాను.
ఈ నాగలి రైతు ప్రపంచాన్ని
ప్రపంచపు ఆకలిని ఎత్తి చూపింది.

దృశ్యం మారింది
చిన్నప్పటి నాగల్లు
కాల బంధనం లో ఇరుక్కుని
ట్రాక్టర్లు గా రూపాంతరం చెందాయి.
అయినా కాసింత మార్పే అనుకున్నా

ఇప్పుడు అదే మట్టి
స్థలాల ముక్కలు గానో
కర్మాగారాలు గానో
మనిషి ని నమిలే కారాగారంలానో
మట్టి యంత్రాలతో పరాయిదైంది.

ఇప్పుడు ఇక్కడే
పనికోసం పోరు బాట పడుతున్నారు.
ఉపాధి కోసం ఉప్పెనలా చూస్తున్నారు.

చినిగిన కలల్ని మోసుకుని
వెట్టిచాకిరి బాటలో
మగ్గిపోవాలని చూస్తున్నారు.

రైతు రాజు కావాలి బానిస కాదు కదా

అర్థం కాని ఈ అంకంలో
కిటకిటలాడుతూ భూమిని సమర్పించిన
రైతుల ప్రాణాలు దిక్కులు చూస్తున్నాయి.

Posted in April 2024, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!