చతుర్దశ అధ్యాయం (చతుష్షష్టి యోగినీ వివరములు)
శ్లోకాలు: 110/2-120, సహస్రనామాలు: 535-600
బ్రహ్మ విద్యా స్వరూపిణికి వందనాలు.
శ్రీషోడశాక్షరీ మహా మంత్రాన్ని కి ‘మహావిద్య’ అని పేరు. అట్టి మహావిద్యా స్వరూపిణికి ప్రణామాలు.
బాల, పంచదశాక్షరి, షోడశాక్షరీ, విద్యకు ‘శ్రీ విద్య’ అని పేరు.
కామదేవునిచే సేవించబడునట్టి తల్లికి వందనాలు.
పదహారు బీజాక్షరాలు గల విద్యాస్వరూపిణికి నమస్కారాలు.
వాగ్భవ, మధ్య, శక్తినామక కూటత్రయ స్వరూపిణికి నమస్కారాలు.
కామకోటి పీఠంలో తేజరిల్లునట్టి కోటికాముల సౌందర్యాన్నధిగమించిన మహాశక్తికి వందనాలు.
అనంతలక్ష్మ్యులచే సేవింపబడు కటాక్షవీక్షణాలుగల మహాశక్తికి ప్రణామాలు.
గురుపాదకల రూపంలో శిరో పరిభాగంలో భాసిల్లు దేవికి వందనాలు.
పూర్ణచంద్రుని వంటి చల్లని కాంతులతో ప్రకాశించు మాతకు వందనాలు.
ఫాలభాగంలో జ్ఞాననేత్రదేశంలో విరాజిల్లు దేవికి వందనాలు.
ఇంద్రధను స్సమాన కాంతులతో సుందరంగా విలసిల్లు తల్లికి వందనాలు.
హృదయాంతరాళంలో భాసిల్లు భవానికి ప్రణామాలు.
అనంతప్రభలతో లోకాల చీకట్ల రూపుమాపే రవి స్వరూపిణికి వందనాలు.
స్వాధిష్ఠాన చక్రంలో త్రికోణాకృతిలో తేజరిల్లు దీపికా స్వరూపిణికి ప్రణామాలు.
దక్షప్రజాపతి సుతయైన సతీదేవి రూపంలో ఖ్యాతిచెందిన మాతకు వందనాలు.
దైత్యులను-అంటే రాక్షసులను అంతం చేసిన శక్తికి నమస్కారాలు.
దక్షునియాగాన్ని విధ్వంసం-నాశనం చేసిన సతీస్వరూపిణికి వందనాలు.
* * * చతుర్దశ అధ్యాయం సమాప్తం * * *
పంచదశోధ్యాయం (పూర్వార్ధము, ఉత్తరార్ధము)
(అమ్మవారి కాలస్వరూప నిరూపణ) శ్లోకాలు: 121-136, సహస్రనామాలు: 601-700
ఆకర్ణాంతం వ్యాపించిన విశాల నేత్రాలుకల మాతకు నమస్కారములు.
మందస్మిత వదనారవిందంతో ప్రకాశించునట్టి ముఖంకల దేవికి వందనాలు.
బ్రహ్మజ్ఞాన స్వరూపిణికి ప్రణామాలు.
గుణాలకు నిధివంటి తల్లికి వందనాలు.
గోజాతికి తల్లి వంటి దేవికి వందనాలు.
గుహుడనగా కుమారస్వామి, కుమార జననికి ప్రణామాలు.
దేవతలకు అధీశ్వరియైన పరమేశ్వరికి ప్రణామాలు.
అర్ధశాస్త్ర+నీతిశాస్త్ర వర్ణితమైన దండనీతిలో విలసిల్లు దేవికి ప్రణామాలు.
హృదయ కుహరానికి దహరాకాశమని పేరు. అట్టి దహరాకాశ రూపిణికి వందనాలు.
పాడ్యమీ ప్రకృతి పూర్ణిమా పర్యంత విశేష విధులచే పూజించదగిన మాతకు ప్రణామాలు.