చిత్ర వ్యాఖ్య
కోకిలద్వయం!!
ఆలోచనామ్రృతమౌ కవితల, పఠిత ల తేలియాడించు పద కోకిలొకటి!
ఈలోకముల నాపాత మధురిమల నించివైచు సంగీతవాసంత లక్ష్మొకటి!!
అరె,జారినాడే!!
అందమైన వెల్గు మామ,చిక్కినట్టె చిక్కినాడె బుట్టలోన!
అందరికీ కనువిందౌ,! కట్టులోపె, జారినాడె నింగిలోన!!
విశ్వమర్మం!!
కణకణల నిప్పు లుమిసేటి సూర్య వాతములిల తాకేన?!
అణువణువు శోకించు నీ శాంత నింక వేల్చి చూచేన,యేచేన?
మ్రృణ్మయ శరీరభ్రృదగ్నుల కేమి యందు, మేధావి చమత్క్రృతు
ల్కణ్వాది ఖగోళ మద్దేవు విశ్వ రచనాతంత్ర పరికల్పనల్!
భంజనము-బంధనము!
చెరకు గడ వోలె రెండుగ విరుగ, పరమశివ చాపము
ధరకు నిండు ఆదర్శమై కలిసె,సీతారామ ధర్మ ద్వయము!