తెలుగు దోహాలు
- మానవుడై జన్మించినా, ప్రజకు దైవమె రాముడు,
ఉడుత సేవ అల్పమైనా, అమిత కరుణ చూపాడు. - మొక్కల యొక్క నిశ్వాసే, మనిషికిస్తోంది శ్వాస,
శ్వాస ఉన్నంతవరకునూ, మనిషికి చావదు ఆశ! - ఋతువుల పరుగు పందెములో, వేసంగిదేను గెలుపు,
బ్రతుకు పోరు గెలువదలచిన, దరి రానీయకు అలుపు! - భానుని లేత కిరణములే, జీవము భువి ప్రాణులకు,
దేవుని దివ్య చరణములే, శరణము భక్త జనులకు!! - కళలకు శ్వాస అందువరకు, బ్రతుకును కళాకారుడు!
మానవత్వం బ్రతుకువరకు, ధర కాచు లయకారుడు!! - పాపలు చిగురించు మొగ్గలు, విరియకుండా త్రుంచకు,
అసలు నిజమును తెలుసుకొనక, నిందలెపుడూ వేయకు. - నిరుపయోగమగు వస్తువే, లేనేలేదీ భువిని!
చెత్తా చెదారమైననూ, కూర్చ గలదులే సిరిని! - అహము వీడనట్టి వాడే, ఎక్కలేడు అందలము!
పిసినిగొట్టు పరులకెపుడూ, పనికిరాడు అంగుళము!! - సిరుల వెనుక పరుగుపెడితే, భవిష్యత్తే శూన్యము!
ఆత్మవిశ్వాసము తరిగిన, ముందు సాగదు కార్యము!! - కార్య సాధకుడు యెప్పుడూ, వట్టి మాటలు పలుకడు,
ధైర్యవంతుడు యెన్నటికీ, వెనుకకు అడుగు వేయడు.