Menu Close
Kadambam Page Title
బాల్యపు స్మృతులు
కే.అమృత జ్యోత్స్న

కాలా గజ్జా కంకాళమ్మ..
పాడుకున్న పాటలు, తెలిపె ఎన్నో వ్యాధులు
నేర్పే ఎన్నో పాఠాలు  నేర్పే ఎన్నో పాఠాలు||

చిన్న నాటి ఆటలు, చిందు లేసే ఆటలు
నేర్పే ఎన్నో పాఠాలు  నేర్పే ఎన్నో పాఠాలు||

కొంగా కొంగా పాలు పొయ్యి...
పాడుకున్న పాటలు, వెర్రితనపు గుర్తులు
చిలిపితనపు చేష్టలు చిలిపితనపు చేష్టలు||

చిన్న నాటి ఆటలు చిందు లేసే ఆటలు
నేర్పే ఎన్నో పాఠాలు  నేర్పే ఎన్నో పాఠాలు||

కర్రబిల్లా ఆటలు, గోలీలతో పోటీలు
మట్టితోటి ఆటలు, మానవత్వపు స్నేహాలు
పెనవేసెను ఎన్నో బంధాలు పెనవేసెను ఎన్నో బంధాలు||

చిన్న నాటి ఆటలు చిందు లేసే ఆటలు
నేర్పే ఎన్నో పాఠాలు  నేర్పే ఎన్నో పాఠాలు||

స్నేహితులు పంచిన అప్పచ్చులు, తిన్న కాకిఎంగిల్లు
ఇంకిపోనీ గుర్తులూ, ఇలలో మధురానుభూతులు
మనసుపై చెరగని ముద్రలు మనసు పై చెరగని ముద్రలు||

చిన్న నాటి ఆటలు చిందు లేసే ఆటలు
నేర్పే ఎన్నో పాఠాలు  నేర్పే ఎన్నో పాఠాలు||

వర్షపునీటిలొ చేసిన కాగితపు పడవలు, తడిసిన మేని హృదయాలు
అమ్మచేతి చివాట్లు నాన్న తోటి గారాలు
మరువలేని జ్ఞాపకాలు మరువలేని జ్ఞాపకాలు||

చిన్న నాటి ఆటలు చిందు లేసే ఆటలు
నేర్పే ఎన్నో పాఠాలు నేర్పే ఎన్నో పాఠాలు||

Posted in January 2024, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!