Menu Close
సప్తస్వరకందము
-- అయ్యగారి సూర్యనారాయణమూర్తి --
నిగమనిగదపదసనిని(1) స
రిగ గరిమగఁ గని(2) సరి గనిరి(3) పదగ(4), మరి దా
సగదసదగద(5) మరినిద(6) మ
రిగమసని(7), దగ సని(8), మని గరిగఁ గనిరి సదా(9)

ప్రతిపదార్థము –

నిగమ=వేదము, నిగద=స్పష్టముగా చెప్పిన, పద= పాద,
సని=సేవ, సరి=పూర్ణము, గరిమ=శ్రేష్ఠము, కని=గ్రహించి,
సరి=శరణము, కనిరి=పొందిరి, ప=ఆపన్నులు, ద=పరిశుద్ధులు,
మరి=మఱియు, దాస= దాసులు, గద=అనారోగ్యము, సత్=మంచి,
అగద=మందు, అరి=అంతశ్శత్రువులు, నిద=విషము,
అరి=చక్రము, గమ=ప్రయాణము, సని=కాంతి, దగ=తాపము,
చని=పోయి, మని=దేవుడు, గరి=ఎక్కువ, కనిరి=చూచిరి,
సదా=ఎల్లప్పుడు.

భావము –

(1)వేదము స్పష్టముగా చెప్పిన పాదసేవను (2)పూర్ణముగా శ్రేష్ఠముగా గ్రహించి,
(3)శరణము పొందిరి. (4)ఆపన్నులు పరిశుద్ధులుగా (5)మఱియు, దాసుల
అనారోగ్యమునకు మంచి మందు, (6)అంతశ్శత్రువులకు విషము, అయిన
(7)చక్రము (సుదర్శనము) యొక్క ప్రయాణపు కాంతిచేత (8)తాపము పోయి
(9)ఎల్లప్పుడు దేవుని ఎక్కువగా చూచిరి.
Posted in March 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!