Menu Close
Kadambam Page Title
కొలవరా భవుని పాపహరుని
వేణుగోపాల రావు, గుమ్మడిదల

పుట్టడం గిట్టడం నట్టనడుమ
........తిని తిరగడమే కాదురా బ్రతుకు
ఆనందం ఆరోగ్యావకాశాలని అందించే
........ఆ బ్రతుకు నిచ్చిన వాడిని తలవరా
సుఖ సంతోషాలని పంచిన వాడిని మెచ్చరా…కొలవరా జంగమదేవరని,
......వదలి పోవురా జడమంతా
మునగరా గంగలో తృప్తిగా,
.......పోవురా నీ పాపాలన్ని నీటి పాలై
పులమరా ఒళ్ళంత విభూతిని,
.......తెగునురా భవబంధాలు
కీర్తించరా ఆ అభయంకరుని ,
.......చింతలన్నీ చితిని చేరునురా
మ్రొక్కరా మువ్వ నవ్వాలని ఆ పాదానికి
.........కళలతోపాటు కీర్తియును నీ స్వంతమౌనురా
భజించుమురా ఆ దేవదేవుని, ఆ లోకమె నీకు దక్కురా
........ఆనందమే అంతటా తాండవమాడునురా...

శంకరా శుభంకరా దయాంభోనిధి
........జగత్సముధ్భవా జగత్సమ్రక్షకా జగత్విలీనా
మూయకురా కన్నులు,
........జగమంతా అంధకారమయ మగునురా
తెరువకురా కళ్ళు పూర్తిగా,
.......లోకాలన్నీ బూడిదగునురా, బండలే మిగులునురా
మందస్మిత యోగంతో కాంచరా
.......నీ సృష్టిని అర్ధినిమీలిత నేత్రాలతో
వర్ణమయమై జగతంతా ప్రభవించునురా
.......సృష్టి అంతటా ఆనందం విల్లివిరియునురా...

శంకరా శుభంకరా దయాంభోనిధో
......పాహిమాం పాహిమాం !
జగత్సముధ్భవా జగత్సమ్రక్షకా జగత్విలీనా,
......పాహిమాం పాహిమాం !

Posted in March 2023, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!