Menu Close
Kadambam Page Title
ప్రేమ మహిమ
డా. సి వసుంధర

చెలీ!
తడియారిన నా హృదయపాత్ర
తపించే ప్రేమ కొరకు
రాకా శశి వోలే రాడేమి
నా ప్రేమ మూర్తి.

ఎండిన ఎడారి వలే
పడి యుండిన నా
హృదయ ధరణి తన
శీతల ప్రేమ రస స్పర్శ
చేత అనందో బ్రహ్మ యనుచు
ఫల పుష్పసమన్వితము
సస్యశ్యామలమై వికసించుననీ
గంపెడు. ఆశ తోడ
గడపవద్దే నిలిచి యుండ గడసరి నా
నాథుడు కనుపించడే
కరుణమాలి.
ఆ..అదిగదిగో ప్రియుని
జాడ తెలుపెనుగా
సుగంధ మారుతము.

చెలీ!ఎండిన నా హృదయ రజితపాత్ర
నిండుచున్నది ప్రేమ మధువు తిన్నగా
నా నాధుని ఆగమనామృత శుభవేళ

Posted in February 2024, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *