పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
మిత్రులారా,
పంచపది ప్రక్రియ ఆసక్తకరంగా ఉన్నది కదా!
2020 లో ప్రజానీకాన్నికరోనా మహమ్మారి చుట్టేసినప్పుడు తమ ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలకోసమై కష్టపడిన FRONT LINE WORKERS లో పోలీసు యంత్రాంగం కూడా ఉన్నది.
‘ఖాకీలు’ అనే శీర్షికతో నేను వ్రాసిన ఈ పంచపదులు ఖాకీల సేవల గౌరవార్థం...మీకూ నచ్చుతాయని ఆశిస్తాను..
1.
(అంత్య ప్రాస అక్షరం – ‘టి’)
నడకలో ఠీవి, మాటలో ధాటి,
విధి నిర్వహణలో మేటి,
మీకెవ్వరు లేరు పోటీ,
మీకు మీరే సాటి,
ఖాకీలకు ప్రణామాలు సత్యా!
నడకలో ఠీవి, మాటలో ధాటి,
విధి నిర్వహణలో మేటి,
మీకెవ్వరు లేరు పోటీ,
మీకు మీరే సాటి,
ఖాకీలకు ప్రణామాలు సత్యా!
2.
(అంత్య ప్రాస అక్షరం – ‘చి’)
ఆకలి దప్పులను మరచి,
ఆలు బిడ్డలను విడచి,
తమ ప్రాణములను మించి,
జన రక్షణే ముఖ్యమని ఎంచి,
కాపాడే ఖాకీలకు దండాలు సత్యా!
ఆకలి దప్పులను మరచి,
ఆలు బిడ్డలను విడచి,
తమ ప్రాణములను మించి,
జన రక్షణే ముఖ్యమని ఎంచి,
కాపాడే ఖాకీలకు దండాలు సత్యా!
3.
(అంత్య ప్రాస అక్షరం – ‘రు’)
ఇల్లు కదలవద్దని వారించేరు ,
ఇంటనే క్షేమమని బుధ్ధి గరిపేరు ,
వినకున్నలాఠీ భాషలో చెప్పేరు,
జనమును కరోనా నుంచి కాపాడేరు,
ఖాకీలు మంచి కార్యదక్షులు సత్యా!
ఇల్లు కదలవద్దని వారించేరు ,
ఇంటనే క్షేమమని బుధ్ధి గరిపేరు ,
వినకున్నలాఠీ భాషలో చెప్పేరు,
జనమును కరోనా నుంచి కాపాడేరు,
ఖాకీలు మంచి కార్యదక్షులు సత్యా!
4.
(అంత్య ప్రాస అక్షరం – ‘రు’)
వలయంలో నిలబెట్టి కట్టడి చేసేరు,
సరుకులు సైతం ఇళ్ళకు చేరవేసేరు,
కష్టాలకోర్చి ప్రాణాలు కాపాడజూసేరు,
రేయీ పవలూ ప్రజా సేవ చేసేరు,
ఖాకీలు చాలా కష్ట జీవులు సత్యా!
వలయంలో నిలబెట్టి కట్టడి చేసేరు,
సరుకులు సైతం ఇళ్ళకు చేరవేసేరు,
కష్టాలకోర్చి ప్రాణాలు కాపాడజూసేరు,
రేయీ పవలూ ప్రజా సేవ చేసేరు,
ఖాకీలు చాలా కష్ట జీవులు సత్యా!
5.
(అంత్య ప్రాస అక్షరం – ‘త’)
మేటియైన త్యాగశీలత,
సాటిలేని సేవాతత్పరత,
దీటులేని కార్యదక్షత,
వీరి కీర్తింపను మాటల కొరత,
ఖాకీలు నిక్కమైన రక్షకులు సత్యా!
మేటియైన త్యాగశీలత,
సాటిలేని సేవాతత్పరత,
దీటులేని కార్యదక్షత,
వీరి కీర్తింపను మాటల కొరత,
ఖాకీలు నిక్కమైన రక్షకులు సత్యా!
వచ్చే నెల మరికొన్ని పంచపదులతో కలుసుకుందామా!