నాన్నకు ప్రేమతో....
‘మాతృ దేవోభవ -పితృ దేవోభవ’
కని పెంచిన తల్లి ప్రత్యక్ష దైవం కాగా
కనిపించే మొదటి గురువు నాన్న
‘అమ్మా- నాన్న’ అన్న పదంలో నాన్న వెనకుంటాడు
కానీ అమ్మ దృక్పథంలో నాన్నే అన్నింటా ప్రధముడు
అమ్మ లాగా నాన్నకి అన్ని మాటలుండవు
మరీ ఎన్నో ముచ్చట్లూ ఉండవు
కానీ ఆ వాత్సల్యపూరిత దృక్కులే
మనకు ఆత్మీయ పలకరింపులు
వెన్ను తట్టి ధైర్యమిచ్చు ఆ చల్లని చేయి
అడుగడుగున ఊతమిచ్చు ఆపన్నహస్తం
అమ్మ నేర్పిన సంస్కార౦, సంప్రదాయం
నాన్న కూర్చిన వ్యక్తిత్వం, విద్యా వికాసం
మన జీవన గమనాన్ని సుగమం చేసి
భవిత కు వేస్తాయి చక్కటి మార్గం
నాన్న చేయి పట్టి ఎక్కిన బడి మెట్లు
మన ఉన్నతి కి పరుస్తాయి రాచబాటలు
మరో ఇంటి వెలుగయి తన కన్న బిడ్డ వెళ్తోంటే
కంటి పాపే పోయినట్టు కలత చెందేను
అమ్మ లేని ఇంట కరువంట ఆదరణ
కానీ నాన్న వినా ఆవాస౦ అనుక్షణం జాగరణే
అన్నింటా నాన్నల త్యాగ ఫలమే మన యీ ఆనందమయ జీవనం
అందుకే,
అమ్మ,నాన్న ఇద్దరూ సమానమే.అమ్మ మొదటి గురువు,నాన్న జీవిత సారథి.ప్రత్యక్ష దైవాలు.చెప్పడానికి మాటలు సరిపోవు
థాంక్స్ ఫర్ ది కామెంట్. బాధ్యత లను నిబద్ధతతో నిర్వహించేటపుడు కొన్ని త్యాగాలు కూడా అప్రకటితముగా ఉంటాయి అని నా అభిప్రాయం.
Adi tyagam Kadu. Tandriga Badhyata antanu.migilina padaalu bagunnaie.