నాన్న, నీకు పాదాభివందనం
నాన్న!
నీవు లేనిలోటును తీర్చలేదు ఈ లోకం
నాన్న, నీ రూపం నేనే నాన్న
కంటి మీద కునుకు మరచి కాచావు నన్ను
కారణాలు చూపిస్తూ దారిచూపినావు
వంటి మీద శ్రధ్ద మరచి పెంచావు నన్ను
బాధలన్ని దిగమ్రింగి దరిచేర్చినావు
మమతలన్ని నూరిపోసి మనిషినే జేశావు
మరిచిపోని జ్ఞాపకాన్ని ఇచ్చిపోయినావు
బంధాన్ని దగ్గర జేసి దేవుణ్ణి చూపావు
సంస్కృతిని తెలియజెప్పి నువ్వెళ్ళిపోయావు
కష్టాన్ని ఛేదిస్తూ సుఖాన్నే మరిచావు
ధర్మాన్ని నేర్పిస్తూ నన్ను నడిపించావు
రాముడే సర్వమని భక్తి నేర్పినావు
సత్యాన్ని మరవొద్దు అని నీతిబోధ చేసావు
కర్మ రూపమీజన్మని కడేగేసుకున్నావు
రామనామ స్మరణే సత్య మంత్రమన్నావు
అద్వితీయ అభిమాన భాండారం నీ హృదయం
సంస్కార సహనం నీ సహజ ధర్మం
అందుకే నాన్నంటే నాకిష్టం
మరిచిపోనిరూపం మా నాన్న జీవితం.............