Menu Close
Lalitha-Sahasranamam-PR page title

పంచదశోధ్యాయం (పూర్వార్ధము, ఉత్తరార్ధము)

(అమ్మవారి కాలస్వరూప నిరూపణ) శ్లోకాలు: 121-136, సహస్రనామాలు: 601-700

641. ఓం ధ్యానగమ్యాయై నమః
ధ్యానముచే మాత్రమే గ్రహించదగిన జననికి వందనాలు.


642. ఓం అపరిచ్ఛద్యాయై నమః
దేశకాలాదులచే పరిచ్ఛిన్నురాలు కాని మాతకు వందనాలు.


643. ఓం జ్ఞానదాయై నమః
జ్ఞానాన్ని ప్రసాదించునట్టి జ్ఞానస్వరూపిణికి ప్రణామాలు.


644. ఓం జ్ఞానవిగ్రహాయై నమః
జ్ఞానమే స్వరూపంగా గల మాతకు ప్రణామాలు.


645. ఓం సర్వవేదాంత సంవేద్యాయై నమః
సర్వవేదాంతలచే అంటే సమస్తమైన ఉపనిషత్తులు చే తెలిసికొనదగిన మాతకు వందనాలు.


646. ఓం సత్యానంద స్వరూపిణ్యై నమః
సత్యానంద అనే స్వరూపంగాగల మాతకు ప్రణామాలు.


647. ఓం లోపామముద్రార్చితాయై నమః
లోపాముద్రాదేవిచే అర్చించబడిన పాదకమలాలు గల తల్లికి నమస్కారాలు.


648. ఓం లీలాక్లుప్త బ్రహ్మాండమండలాయై నమః
లీలామాత్రంచే అంటే అవలీలగా బ్రహ్మాండమండలాలను సృష్టించునట్టి జననికి వందనాలు.


649. ఓం అదృశ్యాయై నమః
సామాన్య దృష్టికి కనిపించని అదృశ్యదేవతకు ప్రణామాలు.


650. ఓం దృశ్యరహితాయై నమః
లౌకిక విషయాతీతమూర్తికి ప్రణామాలు.


651. ఓం విజ్ఞాత్రై నమః
సర్వజ్ఞమూర్తికి ప్రణామాలు.


652. ఓం వేద్యవర్జితాయై నమః
తెలిసికోదగిన విషయాలను వర్జించిన మాతకు నమోవాకాలు.


653. ఓం యోగిన్యై నమః
యోగాభ్యాసరతులరాలైన మాతకు వందనాలు.


654. ఓం యోగదాయై నమః
యోగాన్ని ప్రసాదించు మాతకు ప్రణామాలు.


655. ఓం యోగ్యాయై నమః
సర్వోత్తమ యోగ్య స్వరూపిణికి ప్రణామాలు.


656. ఓం యోగానందాయై నమః
యోగానంద స్వరూపిణికి ప్రణామాలు.


657. ఓం యుగంధరాయై నమః
విశ్వరూప రథానికి శీలగా ఉండి సర్వాన్నీ సంరక్షించు మాతకు ప్రణామాలు.


658. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః
శక్తిత్రయ స్వరూపిణికి వందనాలు.


659. ఓం సర్వాధారయై నమః
యావద్విశ్వానికీ ఆధారస్వరూపిణియైన మాతకు నమస్కారాలు.


660. ఓం సుప్రతిష్ఠాయై నమః
సత్కీర్తి కల మాతకు వందనాలు.


661. ఓం సదసద్రూపధారిణ్యై నమః
సదసత్తులు రూపంగా ధారణ చేసిన మాతకు వందనాలు.


662. ఓం అష్టమూర్త్యె నమః
అష్టమూర్తి స్వరూపుడైన శివునకు వలెనే అష్టమూర్తి స్వరూపిణికి వందనాలు.


663. ఓం అజాజైత్త్ర్యె నమః
బ్రహ్మ, విజయ స్వరూపిణికి వందనాలు.


664. ఓం లోకయాత్ర విధాయిన్యై నమః
లోకయాత్రను విశదీకరించి తద్విధాయినిగా భాసిల్లు మహేశ్వరుడికి ప్రణామాలు.


665. ఓం ఏకాకిన్యై నమః
అద్వైతమూర్తి స్వరూపిణికి ఏకాకినికి నమస్కారాలు.


666. ఓం భూమరూపాయై నమః
సర్వదా లోతైన భూమరూపిణికి ప్రణామాలు.


667. ఓం నిర్ధ్వైతాయై నమః
ద్వైతాతీత స్వరూపిణికి ప్రణామాలు.


668. ఓం ద్వైతవర్జితాయై నమః
ద్వైత భావాన్ని విసర్జించిన మాతకు ప్రణామాలు.

----సశేషం----

Posted in January 2024, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!