Menu Close
Lalitha-Sahasranamam-PR page title

సప్తమ అధ్యాయం (అమ్మవారి నిర్గుణోపాసన)

శ్లోకాలు: 43/2-51/1, సహస్రనామాలు: 132-195

168. ఓం నిష్క్రోధాయై నమః

అవ్యాజ కరుణామూర్తియైన పరమేశ్వరి భక్తులయడల ఎట్టి క్రోధమూ లేకుండ తేజరిల్లుతుంది. అట్టి తల్లికి నమస్కారాలు.


169. ఓం క్రోధశమన్యై నమః

సర్వక్రోధాలను శాంతింప జేయునట్టి తల్లికి వందనాలు.


170. ఓం నిర్లోభాయై నమః

నామమాత్రానికి కూడా లోభం లేనిదై- తన భక్తులయందు కూడా లోభం కలుగకుండ కాపాడునట్టి తల్లికి వందనాలు.


171. ఓం లోభనాశిన్యై నమః

సర్వపాపాలకూ, మహాపాపాలకూ కూడా మూలకారణమైన లోభ గుణాలను నాశనం చేయునట్టి తల్లికి వందనాలు.


172. ఓం నిస్సంశయాయై నమః

ఎట్టి సంశయమూ లేనట్టి నిస్సంశయమూర్తికి వందనాలు.


173. ఓం సంశయఘ్న్యై నమః

సంశయాలు అన్నింటినీ రూపుమాపునట్టి తల్లికి వందనాలు.


174. ఓం నిర్భవాయై నమః

భవము - అనగా పుట్టుకలేనిది. భవరహితురాలికీ వందనాలు.


175. ఓం భవనాశిన్యై నమః

భవమనగా జన్మ- భవనాశిని అనగా పునర్జన్మ లేకుండ చేయునది అర్ధము. అట్టి భవానికి ప్రణామాలు.


176. ఓం నిర్వికల్పాయై నమః

ఎట్టి సంకల్పవికల్పాలూ లేనట్టి తల్లికి ప్రణామాలు.


177. ఓం నిరాబాధాయై నమః

ఎట్టి బాధలూ లేని ఆనందమూర్తికి, ఆనందధాత్రికి వందనాలు.


178. ఓం నిర్భేదాయై నమః

సదసద్భావాదులేవి లేనట్టి తల్లికి ప్రణామాలు.


179. ఓం భేదనాశిన్యై నమః

సమస్త భేదాలను నశింపజేసి అద్వైతభావాన్ని ప్రసాదించు మాతకు వందనాలు.


180. ఓం నిర్నాశాయై నమః

ఎట్టి ఆశలూ లేని తల్లికి వందనాలు.


181. ఓం మృత్యుమథన్యై నమః

మృత్యుమథనంచేసి - అంటే మృత్యువును దూరంచేసి అమరత్వాన్ని ప్రసాదించు తల్లికి వందనాలు.


182. ఓం నిష్క్రిమాయై నమః

క్రియా శూన్యురాలైన నిష్క్రిమమూర్తికి వందనాలు.


183. ఓం నిష్పరిగ్రహాయై నమః

ఏ విధమైన పరిగ్రహమూ లేని తల్లికి ప్రణామాలు.


184. ఓం నిస్తులాయై నమః

తుల-తూచడానికి వీలులేని అతులనీయమూర్తికి నమస్కారాలు.


185. ఓం నీలచికురాయై నమః

నల్లని కేశపాశం కల శ్రీదేవికి నమస్కారాలు.


186. ఓం నిరపాయాయై నమః

ఎట్టి అపాయాలూ లేని దేవికి వందనాలు.


187. ఓం నిరత్యయాయై నమః

న్యూనాధిక, భావాభావాదులేవి లేని తల్లికి నమస్కారాలు.


188. ఓం దుర్లభాయై నమః

సామాన్యులకు లభించని తల్లికి వందనాలు.


189. ఓం దుర్గమాయై నమః

దుర్గమురాలు-అంటే సామాన్యులుచే పొందరానిది--అనగా సామాన్యులు చేరలేని తల్లికి వందనాలు.


190. ఓం దుర్గాయై నమః

దుర్గమక్లేశాల నుండి-- అంటే బాధలనుండి భక్తులను కాపాడు దుర్గాస్వరూపిణికి వందనాలు.


191. ఓం దుఃఖహంత్ర్యై నమః

దుఃఖాలను అన్నింటినీ నాశనం చేయునట్టి మాతకు వందనాలు.


192. ఓం సుఖప్రదాయై నమః

తన భక్తులకు సర్వసుఖాలనూ ప్రసాదించునట్టి తల్లికి ప్రణామాలు.


193. ఓం దుష్టదూరాయై నమః

దుష్టులను దూరం చేయునట్టి తల్లికి వందనాలు.


194. ఓం దురాచారశమన్యై నమః

భక్తులైనవారిని దురాచారం దూరులను సదాచార పరాయణులను మాతకు ప్రణామాలు.


195. ఓం దోషవర్జితాయై నమః

సమస్త దోషాలనూ వర్జించిన సర్వేశ్వరికి ప్రణామాలు.


* * * సప్తమ అధ్యాయం సమాప్తం * * *

----సశేషం----

Posted in August 2022, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!