Menu Close
Lalitha-Sahasranamam-PR page title

సప్తమ అధ్యాయం (అమ్మవారి నిర్గుణోపాసన)

శ్లోకాలు: 43/2-51/1, సహస్రనామాలు: 132-195

132. ఓం నిరాధారాయై నమః

ఎట్టి ఆధారములేని వారికి ఆధార స్వరూపిణియై - తాను ఎట్టి ఆధారమూ లేకపోతే భాసిల్లునట్టి మహేశ్వరికి వందనాలు.


133. ఓం నిరంజనాయై నమః

మాయ లేకుండా - చిత్సరూపిణియై తేజరిల్లు దేవికి వందనాలు.


134. ఓం నిర్లేపాయై నమః

దేనినీ అంటీ అంటకుండా, ముట్టీముట్టకుండ- తామరాకు మీద నీటిబొట్టువలె ఉండునట్టి తల్లికి వందనాలు.


135. ఓం నిర్మలాయై నమః

మాయారూప మలాదులంటక నిర్మల స్వరూపంలో భాసించు దేవికి వందనాలు.


136. ఓం నిత్యాయై నమః

‌నిత్యురాలయిన శ్రీదేవికి వందనాలు.


137. ఓం నిరాకారాయై నమః

నిరాకారిణిగా ఖ్యాతి గాంచినట్టి శ్రీదేవికి వందనాలు.


138. ఓం నిరాకులాయై నమః

ఆ కులము -అంటే మానసిక వ్యాకులాలేమీలేని సంతోష స్వరూపిణికి వందనాలు.


139. ఓం నిర్గుణాయై నమః

సత్త్వ రజస్తమో గుణాలేవీ లేని నిర్గుణరూపిణికి ప్రణామాలు.


140. ఓం నిష్కలాయై నమః

గుణావయవరహితకు వందనాలు.


141. ఓం శాంతాయై నమః

శాంతమూర్తికి-అమృత బీజాత్మకురాలైన శాంతస్వరూపిణికి ప్రణామాలు.


142. ఓం నిష్కామాయై నమః

కామము లేని తల్లికి వందనాలు.


143. ఓం నిరుపప్లవాయై నమః

అమృత స్వరూపిణి యగుట వలన శ్రీ మాత తన. భక్తులను కూడ నాశనరహితులను చేస్తుంది... అట్టి తల్లికి ప్రణామాలు.


144. ఓం నిత్యయుక్తాయై నమః

స్వయంగా తాను నిత్యయుక్తయై తన భక్తులను కూడా నిత్యయుక్తులుగా చేయునట్టి తల్లికి వందనాలు.


145. ఓం నిర్వికారాయై నమః

ఎట్టి వికారాదులూ లేనట్టి మాతకు నమ‌స్కారాలు.


146. ఓం నిష్ప్రపంచాయ నమః

ప్రపంచంకంటే మిన్నయై విశ్వాతీతురాలైన పరాశక్తికి వందనాలు.


147. ఓం నిరాశ్రయాయై నమః

తాను ఆశ్రయాతీతయై కూడ సర్వులకూ ఆశ్రయభూతురాలైన తల్లికి ప్రణామాలు.


148. ఓం నిత్యశుద్ధాయై నమః

శుద్ధ బ్రహ్మ స్వరూపిణకి వందనాలు.


149. ఓం నిత్యబుద్ధ్యాయై నమః

చిత్స్వ రూప జ్ఞానానందమూర్తికి వందనాలు.


150. ఓం నిరవద్యాయై నమః

తనను ఆరాధించునట్టి వారు నరకయాతనలకు గురికాకుండ కాపాడగలుగునట్టి నిరవద్యమూర్తికి వందనాలు.


151. ఓం నిరంతరాయై నమః

భేద, ఛిద్రాతీత మూర్తి యైన నిరంతరాదేవికి ప్రణామాలు.


152. ఓం నిష్కారణాయై నమః

అమృత స్వరూపిణియై ఎట్టి కారణాలు లేకయే తేజరిల్లునట్టి పరమేశ్వరికి వందనాలు.


153. ఓం నిష్కళంకాయై నమః

ఎట్టి కళంకాలూ లేని ని‌ష్కళంక స్వరూపిణికి వందనాలు.


154. ఓం నిరుపాధ్యై నమః

చిత్స్వరూపిణియై ఎట్టి ఉపాధులూ లేకయే భాసిల్లునట్టి మహేశ్వరికి వందనాలు.


155. ఓం నిరీశ్వరాయై నమః

అద్వైతమూర్తియై ‘నిరీశ్వరీ’ నామంతో భాసిల్లు వరదేవతకు ప్రణామాలు.


156. ఓం నీరాగాయై నమః

స్వయంగా తాను ఎట్టి రాగాలూ లేనిదై భక్తజనుల రాగసర్వస్వాన్నీ నెరవేర్చునట్టి రాగరహితయై తేజరిల్లు దేవికి వందనాలు.


157. ఓం రాగమథనాయై నమః

సమస్త దుఃఖాదులకూ కారణభూతమైన రాగాన్ని మధించునట్టి మహేశ్వరికీ వందనాలు.


158. ఓం నిర్మదాయై నమః

మదరహితురాలగు పరమేశ్వరికి వందనాలు.


159. ఓం మదనాశిన్యై నమః

నాశనం హేతువైన మూలాన్ని పోగొట్టునట్టి చైతన్య స్వరూపిణికి ప్రణామాలు.


160. ఓం నిశ్చింతాయై నమః

తాను నిశ్చింతగా ఉంటూ భక్తుల చింతలను కూడా రూపుమాపునట్టి శ్రీదేవికి ప్రణామాలు.


161. ఓం నిరహంకారాయ నమః

ఎట్టి అహంకారాలూ లేనట్టి నిరహంకారమూర్తికి వందనాలు.


162. ఓం నిర్మోహాయై నమః

స్వస్వరూపన్ని మర్చిపోవునట్లు చేయునదియే మోహమనబడుతుంది. అట్టి మోహం నామ మాత్రానికి కూడా లేనట్టి తల్లికి వందనాలు.


163. ఓం మోహనాశిన్యై నమః

మోహ భావాలను నాశనం చేయునట్టి మాతకు వందనాలు.


164. ఓం నిర్మమాయై నమః

స్వయంగా తాను నిర్మమస్వరూపిణియై భక్తజనులకు దుఃఖాలు కలుగనీయక మమత్వాన్ని దూరం చేయునట్టి అమృతమూర్తికి వందనాలు.


165. ఓం మమతాహంత్ర్యై నమః

సమస్త దుఃఖాలకూ మూలమైన మమకారభావాదులను రూపుమాపునట్టి తల్లికి వందనాలు.


166. ఓం నిష్పాపాయై నమః

పాపశూన్యయగు మహేశ్వరికి వందనాలు.


167. ఓం పాపనాశిన్యై నమః

తనను ఆశ్రయించిన వారి పాపాలను నాశనం చేయునట్టి తల్లికి ప్రణామాలు.

----సశేషం----

Posted in July 2022, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!