Menu Close
కీ. శే. శ్రీ అయ్యగారి శేషగిరిరావు
ఫిజిక్స్ బస్సు (కథ)
కీ. శే. శ్రీ అయ్యగారి శేషగిరిరావు

శేషగిరి రావు గారి పరిచయం :

అయ్యగారి శేషగిరిరావుగారు 1943లో ఆంధ్రప్రదేశ్ లో జ్ఞానానికి, కళలకి కాణాచి అయిన రాజమహేంద్ర వరంలో ఒక మధ్యతరగతికుటుంబంలో శ్రీసీతారామమూర్తి, రాజ్యలక్ష్మీదంపతులకు జన్మించారు. తండ్రి ప్రభుత్వోద్యోగి కావడంతో బదిలీలు కారణంగా శేషగిరిరావుగారి తొలివిద్యాభ్యాసం రాజమండ్రి, గుంటూరు, ఏలూరులో సాగింది. వీరు విజయవాడ దగ్గర గుణదల లోని ఆంధ్రాలయోలాకాలేజిలో intermediate course చదివేరు. తర్వాత Physics లో B.Sc.(Hons), M.Sc. విశాఖపట్నం లోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదివేరు.

విద్యాభ్యాసం పూర్తి అయ్యేక Physics Lecturer గా ఉద్యోగం సుదీర్ఘకాలం కోనసీమలోని అమలాపురంలో SKBR College లో కొనసాగించేరు. ఇక్కడే వీరు డిగ్రీ స్థాయిలో భౌతికశాస్త్రవిద్యాబోధనలో క్రొత్త క్రొత్త పద్ధతులతో సాటిలేని ఖ్యాతి గడించేరు. సృజనాత్మకతకి పెట్టింది పేరయిన వీరు All India Physics Teaching Aids Contest లో ప్రదర్శించిన స్వయంగా తయారుచేసిన పరికరాలకు జాతీయ పురస్కారం అందుకొన్నారు.

ఎవరికి భౌతికశాస్త్రంలో ఎటువంటి సందేహం వచ్చినా, హేతుబద్ధంగా, శాస్త్రపరంగా దానికి పరిపూర్ణ నివృత్తిని వారం రోజుల్లో కలిగించిన ఘనత శేషగిరిరావుగారికే దక్కింది. దీనికోసం వీరు పనిచేసిన కళాశాలలో “COMPUTER” పేరుతో ఒక చెక్కపెట్టెను పెట్టి, అందులో సందేహాన్ని కాగితం మీద వ్రాసి (అడిగినవారి పేరు వ్రాయకుండా) పడేస్తే సరిగ్గా వారానికి అదే పెట్టెలో జవాబు లభించే సదుపాయాన్ని ప్రప్రథమంగా ప్రవేశపెట్టి సాగించి, WALKING PHYSICS గా విద్యార్థుల హృదయాలపై చెరగని ముద్రవేసేరు శేషగిరిరావుగారు. సహ అధ్యాపకులు సైతం తమకి వచ్చే, అడగడానికి సిగ్గుపడే, సందేహాలను విద్యార్థుల ద్వారా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని నివృత్తి చేసుకొనేవారు.

EMCET, JEE మొదలగు పోటీపరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు శేషగిరిరావుగారు భౌతికశాస్త్రంలోతర్ఫీదు ఇచ్చేవారు. వీరు ఎక్కడ బోధిస్తే అక్కడకు విద్యార్థులు తండోపతండాలుగా తరలి వచ్చేవారు. దీనికి కారణం concept లేదా physics principles ను క్షుణ్ణంగా తెలిసికొని వాటిని  ఉపయోగించి ప్రశ్నలకు నిర్ణీతసమయంలో సరియైన సమాధానాలు ఎంచుకొని లేదా వ్రాసి, ranks సాధించే విధంగా విద్యార్థులను తీర్చి దిద్దడమే. ఇదివరకు పరీక్షలలో ఇచ్చిన కొన్ని వందల ప్రశ్నలకి సరియైన సమాధానాల్ని విద్యార్థుల బుర్రల్లోకి యాంత్రికంగా ఎక్కించడం కాదు.

భౌతికశాస్త్రపాండిత్యమేకాక రావుగారు ఇంగ్లీషు, తెలుగు భాషాసారస్వతపరిజ్ఞానం బాగా ఉన్నవారు. విద్యార్థిదశలో SSLCలో వీరు చూపించిన ఆంగ్లభాషాపాటవానికి అధ్యాపకులే ఆశ్చర్యపడేవారు. రావుగారు స్వరసహితంగా ఎన్నో సంస్కృతసూక్తాలు, స్తోత్రాలు నేర్చుకొని, ఆర్షసంప్రదాయాలను అర్థంచేసుకొని అమలులో పెట్టినవారు.

కళారంగంలో, రావుగారు తమ తండ్రిగారి వద్ద అభ్యసించిన FRET WORK కళను వాడి plywood లోనే కాక decolam sheets లో ఎన్నోరెట్ల నైపుణ్యంతో కళాశిల్పాలను సృష్టించేరు. ఎదిగే పిల్లలకి, పెద్దలకు సైతం, వినోదం, intellectual development కి దోహదపడే చాలా puzzles ను ఈ కళను ఉపయోగించి స్వయంగా తయారు చేసేరు. తన చిన్ననాడే రంగులు ఉపయోగించి చిత్రలేఖనం చేసి కుటుంబంలో తనకంటే చిన్నవారికి మార్గదర్శి అయ్యేరు.

CALLIGRAPHY లో కూడా రావుగారు సిద్ధహస్తులు. వీరి “ఫిజిక్స్ బస్సు” వ్యాసంలోని దస్తూరి దీన్ని కొంతవరకు ప్రతిబింబిస్తుంది.

“ఫిజిక్స్ బస్సు” వ్యాసంలోని పాత్రలపేర్లు, ఇంటిపేర్లు శేషగిరిరావుగారి భౌతికశాస్త్రజ్ఞానమే కాక తెలుగు కవితాజ్ఞానాన్ని కూడా సూచిస్తాయి. ఉదాహరణకి, లూతయ్య పాత్ర (లూత అంటే సాలీడు. నేతగాడు కదా. మహాకవిధూర్జటివిరచిత శ్రీకాళహస్తీశ్వరశతకంలోని ‘శ్రీ’ దీన్నే సూచిస్తుంది. “ఏ వేదంబు పఠించె...” అనే పద్యంలో లూత ప్రత్యక్షమౌతుంది).

అదిగో ఫిజిక్స్ బస్సు వచ్చేస్తోంది! ఇంక ఆలస్యం చెయ్యకుండా ఎక్కేద్దాం. లేకపోతే మనల్ని తీసికెళ్ళకుండానే వెళ్ళిపోతుంది.....

****

Posted in July 2022, Uncategorized, కథలు

1 Comment

  1. Srinivas Tadi

    I consider sir as my best teacher. I always enjoyed his classes and feel blessed to have him as my teacher for couple of years in my life. 🙏🙏🙏

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!