Menu Close
Kadambam Page Title
కవిత్వమైనా, జీవితమైనా.....
పారనంది శాంతకుమారి

తేజోవంతమైన భావం స్ఫురించినప్పుడు
అర్ధవంతమైన పదాలు ఆశువుగా అలరిస్తాయి
కవిత్వాన్ని పూరిస్తాయి.

నీతివంతమైన జీవితం గడుపుతున్నప్పుడు
నిశ్చయమై ఉన్న సుఖాలు
నిత్యమూ నీతోనే చరిస్తాయి,
జీవితాన్ని సంతోషమయం చేస్తాయి.

మనసు స్వచ్ఛమైన ధృడ సంకల్పంతో
ముందుకు సాగితే
పదాల కోసం పాకులాడనక్కర లేదు
సుఖాల కోసం వెదుకలాడనక్కరలేదు

కవిత్వమైనా, జీవితమైనా
నీతితోను, ఒక నిర్ధిష్టమైన రీతితోను
నడిచినపుడే
ప్రయోజనంతో పరిపూర్ణ మౌతాయి.

Posted in April 2022, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *