ఎదురుచూపులు
నీ రాక కోసం ఎదురుచూసి
ధమన్లు లోని రక్తప్రవాహం దిగులుపడెను
సిరల్లోని రుధిరం చిన్నబోయేను
ఏ పిలుపు విన్నా నీదేనేమో అనే ఆశ
ఏ రూపం చూసినా నీవెనేమో అనే ధ్యాస
కలలోని నీవే, కనులముందు నీవే
నా ధ్యాసలోని నీవే, నా శ్వాసలోని నీవే
మదిలోమేదిలే భావాలు నీకోసమే,
మెదడులో రేకెత్తించే ఆలోచనలు నీకోసమే
నిమిషానికి అరవై సెకన్లు అయినా
నీకోసం చూసే ఎదురుచూపులతో
నిమిషానికి ఇన్ని వేలగడియలా అనే భ్రమ కలిగెనే..
గంటలు మారుతున్నా నీగొంతుక వినిపించదాయే
రోజులు గడుస్తున్నా నీజాడ కానారాదాయే
నెలవంక వచ్చిపోయేనే, నెలలు మారిపోయేనే
నీవు వచ్చేది ఎప్పుడా అని ఎదురుచూసిన నా కన్నులు కాయలుకాసేనే..
సూర్యుడి కోసం వేకువలా,
చంద్రుడి కోసం మలి సంధ్యలా
నీరాక కోసం నేను ఆశించడం తప్ప,
నిన్ను రమ్మని ఆదేశించలేను.