Menu Close
Geethanjali-page-title

94

AT this time of my parting, wish me good luck, my friends! The sky is flushed with the dawn and my path lies beautiful.

Ask not what I have with me to take there. I start on my journey with empty hands and expectant heart.

I shall put on my wedding garland. Mine is not the red-brown dress of the traveller, and though there are dangers on the way I have no fear in my mind.

The evening star will come out when my voyage is done and the plaintive notes of the twilight melodies be struck up from the King's gateway.

సీ. సెలవిక సఖులార! కలిసి‌దీవెనలిండు
    విడిపోవు సమయమ్ము వడిగ వచ్చె

    ఆకసమ్మున పొద్దు నలదె వెల్గుల రేఖ 
    దివ్యపథమెదుట తీరి‌నిలిచె

    బయలుదేరితి నేను వట్టిచేతులతోడ
    కదలాడు గుండెలో కాంక్ష మిగిలె

    పథికుల కాషాయ వసనమ్ము వలదు, నే
    నుద్వాహ సుమమాల నురమునుంతు

ఆ. నడచు దారి లోన యిడుములే గల్గనీ
    నిర్భయముగ వాని నిలువరింతు 
    సాగి‌పోదునోయి ఆగకెచ్చట, భీతి
    మాట యెరుగకెపుడు మనసులోన

ఆ. ముగిసినంత యాత్ర, యగుపించు పడమటి
    తార యాకసమున తళుకు మనుచు
    రాజ వీథి లోన రాగమ్ము వినిపించు
    కరుణ రసము నిండు స్వరములెవియొ!!!

95

I WAS not aware of the moment when I first crossed the threshold of this life. What was the power that made me open out into this vast mystery like a bud in the forest at midnight!

When in the morning I looked upon the light I felt in a moment that I was no stranger in this world, that the inscrutable without name and form had taken me in its arms in the form of my own mother.

Even so, in death the same unknown will appear as ever known to me. And because I love this life, I know I shall love death as well.

The child cries out when from the right breast the mother takes it away, in the very next moment to find in the left one its consolation.

సీ. జీవలోకపు హద్దు చెరిగిపోయెనెపుడు?
    ఎపుడు వచ్చితినిట కెరుగలేను!!!

    విపినయామిని లోన, విరిబాలగా, నన్ను
    వికసింప జేసె నే విశ్వ శక్తి?

    నూతనత్వపు ఛాయ లేతావునన్ నాకు
    తలపురానీక యీ, ధామమందు,

    నామరూపములేని యే, మహా ప్రేమయో!
    అక్కున జేర్చె మా అమ్మ వోలె

ఆ. చరమ ఘడియల నను, కరుణతో జూచిన
    ప్రేమ యిదియనిపుడు విదితమయ్యె!!!
    జీవితమును ప్రేమచే యాదరించితి,
    మరణమటులె నాకు మక్కువౌగ

ఆ. కుడి స్తనమ్ము తనకు యెడమైన‌, శిశువు,
    తల్లడిల్లి యేడ్చు దప్పిగొనుచు!!
    యెడమ చన్ను, తల్లి, యిచ్చినంత‌ మరల
    ఊరడిల్లు తాను ఉనికి మరచి

96

WHEN I go from hence let this be my parting word, that what I have seen is unsurpassable.

I have tasted of the hidden honey of this lotus that expands on the ocean of light, and thus am I blessed ⎯ let this be my parting word.

In this playhouse of infinite forms, I have had my play and here have I caught sight of him that is formless.

My whole body and my limbs have thrilled with his touch who is beyond touch; and if the end comes here, let it come ⎯ let this be my parting word.

సీ. ఈలోకమును వీడి యేగునపుడు యిదె
    చరమవాక్యమ్ముగా వరలనిమ్ము

    నీదివ్య ధామమ్ము నిరుపమానంబనీ
    నేగన్న సత్యమ్ము నిలువనిమ్ము

    కమలహృదయములోని కమ్మని పూదేన
    వెలుగు కడలి పైన విస్తరించు

    ఆమధువును గ్రోలి అమృతమయుడనైతి
    ననినన్ను తెలుపనీ యార్తి తోడ

ఆ. జగతి నాటకమున అగణిత రూపాలు,
    అందునాదు పాత్ర నాచరించి,
    రూప రహితుడైన లోకేశుగంటినే
    నఖిల జీవులందు నలరునతని

ఆ. వాక్కు మనసు చేత వర్ణింప జాలని
    ప్రభుని తాకి మేను పరవశించె
    ఇదియె ఔను గాక తుదిశ్వాస, కానిమ్ము!
    అతని మ్రోల విడుతు నసువు లైదు

97

WHEN my play was with thee I never questioned who thou wert. I knew nor shyness nor fear, my life was boisterous.

In the early morning thou wouldst call me from my sleep like my own comrade and lead me running from glade to glade.

On those days I never cared to know the meaning of songs thou sangest to me. Only my voice took up the tunes, and my heart danced in their cadence.

Now, when the playtime is over, what is this sudden sight that is come upon me? The world with eyes bent upon thy feet stands in awe with all its silent stars.

సీ. ఎవరునీవంచు నే నెన్నడడుగలేదు
    వేళమరచి నీదు ఖేలలోన

    సాగిపోయె బ్రతుకు, సందడిగా, నాడు,
    బిడియమన్నది లేదు వెరపు లేదు

----

    తెలవారక మునుపె కలనుండి మేల్కొల్పి
    చెలికానిగా, చేయి, చేతబట్టి,

    పచ్చిక బీళ్ళలో పరుగుపందాలాట,
    ఆడించితివి నన్ను తోడు నిలిచి

ఆ. నీవు ఆలపించు వేవేల గీతాల
    అర్థమెరుగ కున్న, ఆలకించి,
    రాగమందుకొనెను నాగొంతులీనమై
    కరగియాడెను యెద స్వరములందు

ఆ. ఇపుడు ఖేల ముగియ, నేమిజూతు నెదుట!
    సృష్టిలో యపూర్వ దృశ్యమొకటి
    "నీదు పదములందు నిలిపి చూపు, వంగె
    కోటితారకలను కూడి జగతి"

98

I WILL deck thee with trophies, garlands of my defeat. It is never in my power to escape unconquered.

I surely know my pride will go to the wall, my life will burst its bonds in exceeding pain, and my empty heart will sob out in music like a hollow reed, and the stone will melt in tears.

I surely know the hundred petals of a lotus will not remain closed for ever and the secret recess of its honey will be bared.

From the blue sky an eye shall gaze upon me and summon me in silence. Nothing will be left for me, nothing whatever, and utter death shall I receive at thy feet.

సీ. కైసేతు నోటమి కంఠమాలగజేసి
    ఎదురులేని విధికి ఎదిరి కాను!

    అణగిపోవును నాదు అహమంత, తునియలై,
    ప్రాణబంధము త్రెళ్ళు బాధ తోడ

    శూన్యమౌ హృదయాన దైన్యగీతిక విని
    కరగి కన్నీరౌను గండ శిలలు

    కమలమ్ము ముకుళించి కలకాలముండునా!
    యెదలోతు నమృతమ్ము కదలి రాద.

ఆ. నీలినింగి నుండి నిశ్శబ్దముగ జూచి,
    నన్నుబిలుచు దివ్య నయన మొకటి!!
    నాదియన్నదేది లేదింక కణమైన,
    ప్రాణమిత్తు నీదు పదములందు!!!

99

WHEN I give up the helm I know that the time has come for thee to take it. What there is to do will be instantly done. Vain is this struggle.

Then take away your hands and silently put up with your defeat, my heart, and think it your good fortune to sit perfectly still where you are placed.

These my lamps are blown out at every little puff of wind, and trying to light them I forget all else again and again.

But I shall be wise this time and wait in the dark, spreading my mat on the floor; and whenever it is thy pleasure, my lord, come silently and take thy seat here.

సీ. బడలి, నా చుక్కాని విడిచినంతట, నీదు,
    కరములన్ బడునంచు నెరుగుదోయి

    కరణీయ మైతీరు, పరుగాట మానింక!
    వ్యర్థమీ‌యాతన వాదమేల!!

    పట్టువిడు మనసా, భరియింపు మోటమి,
    భాగ్యమని తలచు బడయు ఫలము!!

----

    కొంత గాలి తాకి కొండెక్కు దివ్వెల,
    వెలుగ జేయ జూతు తెలివి మరచి!!

ఆ. తెలివి గలిగి యిపుడు, నిలుతునీ మసకలో,
    వేచియుందు నిచట పీఠముంచి!!
    ఇఛ్ఛ గల్గినపుడు వచ్చియీ పీఠికన్,
    అధివసించు స్వామి ఆదరమున!!

*** సశేషం ***

Posted in April 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!