Menu Close
Kadambam Page Title
స్వాగతం ఓ అతిథి
అన్నపూర్ణ ఏ

అనుకోని అతిథివై అరుదెంచినావు...
ఆత్మీయభావమేదో మదినింపినావు!

మాటలురాని అనుభూతిలో....
కన్నెమనసులో కలవరింతలు!
కలలోకూడా ఊహించని అదృష్టం.....
అంబరమంటిన ఆనందం!

అల్లరివయసుచేసే గారడీలు....
జలపాతాల పరవళ్లు!

కోయిలగొంతులో అల్లరి పిలుపులు...
నాలో కలిగించినవీ కోరికలు!

వెన్నెల రేడు రేపిన వేదనలు....
తారలు చేసే పరిహాసాలు!

ఎదనిండిన తీపి గురుతులు ....
సుగంధ పరిమళాల పరవశాలు!

ఆశల పందిరిలో విరిసిన విరులు....
ఫలించినఓయీ నాదు స్వప్నాలు.!

హృదయ తంత్రులు మీటిన రాగాలు.....
నీవు పంపిన ప్రణయ సందేశాలు!

Posted in April 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!