Menu Close
mg

మౌనంగానే ఎదగమనీ

అందరికీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు !!!

కొన్ని తెలుగుపాటలు ఎంతో శ్రావ్యంగా, సున్నితమైన దారిలో వెళుతున్న భావనను కలిగిస్తూ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. అయితే వాటిలో కొన్ని వినేకొద్ది కుతూహలాన్ని కలిగిస్తాయి. అందుకు కారణం ఆ పాటకు వ్రాసిన పదాల భావపూరిత నిగూఢమైన అర్థం. అటువంటి అమృతధార ఈ 'మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది...' పాట. ఈ పాటకు మరో బలం, తెలుగు భాష తేజం, తెలుగులోనే మాట్లాడుతూ, తెలుగు తియ్యదనాన్ని తన పాటలలో సదా నింపుతూ ఉండే శ్రీ చంద్రబోసు గారు ఈ పాటను రచించారు. ఒక సందేశాత్మక సన్నివేశాలతో ఈ పాట చిత్రీకరణ జరిగింది. నిజంగా ఎంతో ఉన్నతమైన ఈ పాటను సినిమా కొరకు ప్రముఖ గాయని చిత్ర గారు ఆలపించగా ఇప్పుడు చి. ప్రతీక బుడమగుంట గళంలో విందాం.

చిత్రం: నా ఆటోగ్రాఫ్; స్వరకల్పన: కీరవాణి;

పల్లవి:

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

చరణం 1:

దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంట ఉంటుందిగా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

చరణం 2:

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
నచ్చినట్టుగా నీతలరాతను నువ్వే రాయాలీ

నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ
అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

Posted in April 2021, పాటలు