చూపు కవాతు
భయం ప్రేమించి
నిద్ర గుచ్చుకుని రాత్రికి గాయమై
పగటి పెదవులపై
కాలపు నల్లని నడకలకు
ఇష్టం చిట్లి బొట్లు బొట్లుగా
ముఖంలో ఇంకి
తడిసిన కళ్ళకు పారిన బాధకు
ఎండిన కలతో వాడిన నిజం
ఓడిన మనసుతో ఒరిగిన అలోచన
పాత రోజుల వాకిట ఆశకు వ్రేలాడుతూ
గతం ముందడగేసి
జారిన నిజాలను జాలితో చేతికందిస్తే
గడ్డకట్టి కరుడుకట్టిన కోరికల్లో
ఒక్క కోరికలో కదలికొచ్చినా
మనసు చిగుర్లు వేసి
జ్ఞాపకాల తేమను
రోజూ రోజును గుచ్చి గుచ్చి
నీ ఆనవాళ్ల కోసం
చూపు కవాతు చేస్తూనే ఉంటుంది..