చిత్ర వ్యాఖ్య
బ్రాహ్మీశోభ!!
హరి చేల మట్లు వెలుగు రేకల బంగరు సౌరుల
హరి నీల వర్ణమట్లు గగనాస్తరణ విస్త్రృతుల
మరి దేని కోరని నారాయణీయ శాంత సుశోభల
సరియె లేని నేత్రపర్వ ప్రాభాత సౌందర్యమిదిగో!!
రవివర్మ
కలల దర్శించి,కుంచెతో రూపు కట్టించి,
పలు వన్నెల నందించినావో!,నీ ఊహల
పల్కరించిన ఆక్రృతులకె,చిత్ర వర్ణ
మేళనముల, కలరూపుల నిచ్చినావో!
(ii)
వెల లేని చిత్ర లేఖన కళా గౌరీ శంకర శ్రృంగమ!!
తుల యేది నీకు భువి,వందనమిదె,రాజ!రవివర్మా!!
రామనామము!
వాయులీన రాముకివే
వేయి వేయి దండములు!
హాయి గొల్పు నామమున్న
రేయి పొద్దు చాలునులే!
మా అమ్మ!
నా కేమి కొరతర,మా అమ్మతో నేనుండ!
నా కేది దీటుర,మా అమ్మ బంగారు అండ!
నా కంటి పాప, నను కాచేటి కవచము!
నా కలల అమ్మ, కథల కాణాచి అమ్మ!