Menu Close
Page Title

సంగీతం పై సాహిత్య ప్రభావం

ఆ.) సముద్రాల రాఘవాచార్య:

(చిత్రం: భూమికోసం, సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు, పాడినది: ఘంటసాల) లింక్ »

పల్లవి:
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజము మరచి నిదురపోకుమా

బడులే లేని పల్లెటూళ్ళలో చదువేరాని పిల్లలకు
చవుడు రాలే చదువుల బడిలో
జీతాల్రాని పంతుళ్ళకూ

చాలీ చాలని పూరిగుడిసెలో
చాలీ చాలని పూరిగుడిసెలో కాలేకడుపుల పేదలకు
మందులులేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు

తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలియైపోయిన పడతులకు

కూలిడబ్బుతో లాటరీ టికెట్‌ లాటరీ టికెట్‌
కూలిడబ్బుతో లాటరీ టికెట్‌ కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరచి
చెడే నిరాశా జీవులకు
సేద్యంలేని బీడునేలలో
పనులే లెని ప్రాణులకు
పగలూ రేయీ శ్రమపడుతున్నా
ఫలితం దక్కని దీనులకు


{చిత్రం: మనుషులు మారాలి; సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల} లింక్ 1 »లింక్ 2 »

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం… ఉదయరాగం.. హృదయగానం

వేల వేల వత్సరాలకేళిలో…మానవుడుదయించిన శుభవేళలో

వీచె మలయమారుతాలు …పుడమి పలికె స్వాగతాలు
మాలికలై తారకలే…మలిచెకాంతి తోరణాలు..

వలపులోన పులకరించు కన్నులతో …చెలిమి చేరి పలకరించు మగవారు

మనసులోన పరిమళించు వెన్నెలతో…ప్రియుని చూచి పరవశించే ప్రియురాలు
జీవితమే స్నేహమయం… ఈ జగమే ప్రేమమయం.. ప్రేమంటే ఒక భోగం
కాదు కాదు అది త్యాగం ..ఓ..ఓ…హోయ్..

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం…ఉదయరాగం.. హృదయగానం..


ఇ.) మల్లాది రామకృష్ణ శాస్త్రి
1. {చిత్రం: జయభేరి; సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు, పాడినది: ఘంటసాల} లింక్ »

రసికరాజ తగువారము కామా
రసిక రాజ తగువారము కామా
ఏలు దొరవు… అరమరికలు ఏలా
ఏల వేల సరసాల సురసాల

నిన్ను తలచి గుణగానము జేసి
దివ్యనామ మధుపానము జేసి

నిన్ను తలచి పా దపమ గరిసా
నిన్ను తలచి

దనిప నిదసనిప మగరిస నిసరిస నిససని
సమగమపమ గమగనిసనిప మగ మగ సనిస
నిసరిమగ మరినిసనిస దనిస నిపమప మగరిస
నిన్ను తలచి నిన్ను తలచి… గుణగానము జేసి
దివ్యనామ మధుపానము జేసి
సారసాక్ష మనసా వచసా
నీ సరస చేరగనే సదా వేడనా


2. (చిత్రం: జయభేరి, సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు, పాడినది: ఘంటసాల) లింక్ »

రాగమయీ రావే అనురాగ మయీ రావే

రాగమయీ రావే అనురాగ మయీ రావే

నీలాల గగనాన నిండిన వెన్నెల ఆ ఆ ఆ
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీ చిరునవ్వుల కలకల లాడగా

చిగురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
చిగురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
తనువై మనసై నెలరాయనితో
కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నీవే
సంధ్యలలో హాయిగ సాగే చల్లని గాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన
చుక్క కన్నెలు అంబరాన
జిలుగే సింగారమైన
చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ
నీడ చూసి నీవనుకొని పులకరింతునే
అలవికాని మమతలతో కలువరింతునే
నీకోసమే ఆవేదన
నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే

రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయి


3. (చిత్రం: రహస్యం, సంగీతం: ఘంటసాల, పాడినవారు: ఏ.పి.కోమల,ఘంటసాల,మాధవపెద్ది సత్యం, పి.సుశీల) లింక్ »
గిరిజాకల్యాణం


4. (చిత్రం: చిరంజీవులు, సంగీతం: ఘంటసాల, పాడినవారు: పి.లీల ) లింక్ »
తెల్లవారవచ్చె – తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసులుతూ ఉండేవు
మారాము చాలింక లేరా
కలకలమని పక్షి గణిములు
చెదిరెను కళ్యాణ గుణధామ లేరా
తరుణలందరు దధి చిలికే వేళాయే
దైవరాయ నిదురలేరా
నల్లనయ్యా రారా! ననుగన్నవాడా!
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా, మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్నతిందువుగానీ రారా


5. (చిత్రం: ఉండమ్మా బొట్టుపెడతా ,సంగీతం: కే.వీ.మహదేవన్, పాడినవారు: సుశీల) లింక్ »

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
దీపం మరి మరి వెలగాలి.. తెరలూ పొరలూ తొలగాలి

తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం
నడిచే దైవం.. ప్రతి పులుగూ ఎగిరే దైవం..
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..

-సశేషం-

Posted in April 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!