నీరు
ప్రకృతివనరులలో నీటి కెంతో ప్రాముఖ్యము ఉంది. అదే ఈ కవితకు ప్రేరణ.
ఉ.
ఏ గ్రహమందునైనఁ గల వించుక యన్నను నీటిచాయలే
ఆ గ్రహ మౌను జీవముల కాశ్రయ మందురు శాస్త్రకోవిదుల్
భూగ్రహమందు నాల్గిటను మూఁడిట నంబుధులే కదా, ద్విపా
ద్విగ్రహమందు(1) వందకును దీరుగఁ దొంబది పాళ్ళు నీరమే
............(1) మానవుల శరీరమందు
ఆ గ్రహ మౌను జీవముల కాశ్రయ మందురు శాస్త్రకోవిదుల్
భూగ్రహమందు నాల్గిటను మూఁడిట నంబుధులే కదా, ద్విపా
ద్విగ్రహమందు(1) వందకును దీరుగఁ దొంబది పాళ్ళు నీరమే
............(1) మానవుల శరీరమందు
చం.
మనుజుని శోష దీర్చు విసుమానముగా జలబిందురాశి, యే
ఘనమగు వైద్యవస్తువులుగాని యొనర్పఁగఁ జాల వివ్విధిన్,
మనుగడ సాగ దిక్కగు సమంబుగఁ బ్రాణుల కెల్ల, విశ్వమం
దున నమృతంబునాఁ(1) బరఁగి తోరపు గౌరవ మొందు నంబువుల్
............(1) అమృతము = జలము
ఘనమగు వైద్యవస్తువులుగాని యొనర్పఁగఁ జాల వివ్విధిన్,
మనుగడ సాగ దిక్కగు సమంబుగఁ బ్రాణుల కెల్ల, విశ్వమం
దున నమృతంబునాఁ(1) బరఁగి తోరపు గౌరవ మొందు నంబువుల్
............(1) అమృతము = జలము
చం.
ఉదకము స్థాన మా హరికి, నుత్తమమౌ గతు లొందఁజేయు నా
ఉదకమె గంగరూపమున, నూరక శీర్షమునన్ ధరించునా
ఉదకము నీశ్వరుం? డది మహోన్నతప్రాంతము వీడి దూఁకఁగా
పదుగురు వాడు శక్తి(1) నిడుఁ బల్లముఁ జేరి స్రవించి యేఁగుచున్
............(1) విద్యుచ్ఛక్తి
ఉదకమె గంగరూపమున, నూరక శీర్షమునన్ ధరించునా
ఉదకము నీశ్వరుం? డది మహోన్నతప్రాంతము వీడి దూఁకఁగా
పదుగురు వాడు శక్తి(1) నిడుఁ బల్లముఁ జేరి స్రవించి యేఁగుచున్
............(1) విద్యుచ్ఛక్తి
ఉ.
పంటల కెల్లఁ బ్రాణ మగుఁ, బాఱిన భూమి పవిత్రమౌఁ గదా
తుంటరిచేష్టలన్ మొదలుతోఁ బెకలించుచు వృక్షసంపదన్
కంటికిఁ గానరాని గతి గల్గఁగఁ జేయఁ బ్రవాహధాటికిన్
కంటితడే లభించుఁ గద, నాశము బుద్ధివినాశకౌశలౌ(1)
............(1) బుద్ధి వినాశము ఇచ్చు కానుక అగును
తుంటరిచేష్టలన్ మొదలుతోఁ బెకలించుచు వృక్షసంపదన్
కంటికిఁ గానరాని గతి గల్గఁగఁ జేయఁ బ్రవాహధాటికిన్
కంటితడే లభించుఁ గద, నాశము బుద్ధివినాశకౌశలౌ(1)
............(1) బుద్ధి వినాశము ఇచ్చు కానుక అగును
ఉ.
తీర్థములందు ముఖ్యము నదీజలముల్, గుడులందు నీరమే
తీర్థముగా నొసంగుఁగద దేవతదీవెనలన్ శ్రితాళికిన్,
అర్థముఁ గూర్చుఁ గ్రీడలకు, హర్షముఁ బెంచును, శాంతి నిచ్చుఁగా
వ్యర్థము నీరు లేనియెడ వారిజముల్ జలజాస్యనేత్రముల్(1)
............(1) నీటిలో పుట్టిన కమలము వంటి ముఖము, కనులు

ఆ.వె.
పూర్ణకుంభములకుఁ బుణ్యదానములకు
భూరిభారయానములకుఁ బ్రకృతి
శోభ పెంచు బింబ(1)సుందరదృశ్యాల
కింద్రచాపమునకు నిది నిధి(2) యగు
............(1) నీటిలో ప్రతిబింబము (2) ఆధారము
భూరిభారయానములకుఁ బ్రకృతి
శోభ పెంచు బింబ(1)సుందరదృశ్యాల
కింద్రచాపమునకు నిది నిధి(2) యగు
............(1) నీటిలో ప్రతిబింబము (2) ఆధారము
కం.
రకరకము లైన వలసల
కొకకళ(1) కిది మూలమగుచు నూపిరి వోయున్
ఒక వాద్యము(2) మ్రోఁగంగను,
సకలం బిది నిండుఁ దుదకు సమయము(3) రాఁగన్
............(1) జలస్తంభనము (2) జలతరంగిణి (3) యుగాంతము
కొకకళ(1) కిది మూలమగుచు నూపిరి వోయున్
ఒక వాద్యము(2) మ్రోఁగంగను,
సకలం బిది నిండుఁ దుదకు సమయము(3) రాఁగన్
............(1) జలస్తంభనము (2) జలతరంగిణి (3) యుగాంతము
కం.
అమితానందము గలిగిన,
నమితంబగు దుఃఖ మొదవ, నందఱి కనులన్
సమయోచితముగఁ బరమగు
రమణుల కెక్కువగ నశ్రురాజిగ నిదియే
నమితంబగు దుఃఖ మొదవ, నందఱి కనులన్
సమయోచితముగఁ బరమగు
రమణుల కెక్కువగ నశ్రురాజిగ నిదియే
కం.
దైవాభిషేకపూజా(1)
భూవరపట్టాభిషేకప్రోక్షణములకున్
జీవము పవిత్రజలమే;
జీవన(2) మన ప్రకృతివరము జీవుల కెల్లన్
............(1) దేవుని పూజలో పత్రము, ఫలము, పుష్పము తోడిది
............(2) జీవనము=నీరు
భూవరపట్టాభిషేకప్రోక్షణములకున్
జీవము పవిత్రజలమే;
జీవన(2) మన ప్రకృతివరము జీవుల కెల్లన్
............(1) దేవుని పూజలో పత్రము, ఫలము, పుష్పము తోడిది
............(2) జీవనము=నీరు