Menu Close
Kadambam Page Title
ఎవరు నువ్వు?
‘ఉదయశ్రీ’ యు.సి.ఓబులేశు గౌడు

ఎవరు నువ్వు అసలెందుకా నవ్వు
నా వెంటపడి నన్నేల వేధిస్తున్నావు
నా మనమ్మునేల శోధిస్తున్నావు
దరికి ఉరికి వచ్చి కలవరపెడతావు
దూరమై జరిగి కలగా తలపిస్తావు
అంతలోనే అల్లంత దూరాన నిల్చొని
నన్ను చాటుచాటుగ గమనిస్తావు
నీ పెదవి మాటుగ పరిహసిస్తావు
నిదురించే నా మదిని కదిలిస్తావు
మేల్కొన్న ఆ మనసును గేలిచేస్తావు
నాలోని ప్రణయవీణను మీటుతావు
నీవే ఆ వీణాతంత్రులు తెంచుతావు
గీతానికి పల్లవి లేకుండ చేస్తావు
సంగీతానికి రాగం లేకుండ చూస్తావు
నా ఉల్లము నల్లకల్లోలం చేస్తావు
అసలు నన్నేం చేయాలనుకున్నావు?
ఇంతకీ నీవేం సాధించాలనుకున్నావు?

Posted in February 2024, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *