ఏమని చెప్పాలి ఈ కవిత్వ తత్వాన్ని...?!
సంక్లిష్టతలోని పరాకాష్ఠలా,
సరళత్వ ఉద్వేగమైన కవనం కల్పితమే.. కానీ,
భావాత్మక జగత్తు లో
అదో రసమయమైన అధ్వైతమై...
ఆసాంతం మన మస్తిష్కంలో...
పుట్టిన ఆ రససిద్ధికి ఆపై వచ్చే
భావాల అనురక్తికి భాష్యం చెప్పాలంటే...
మనసులో రమించి, తపించి స్పందించిన
వలపు, తనువు తపనలను ఆస్వాదించి...
అనుభవించిన ఆ గుండె సవ్వడులకు
ఎన్ని లయలో ...ఎన్నెన్ని హొయలో..
దానికి తన్మయత్వ హోరూ తోడై ...
ఆ సొగసులు కూడా అద్దుకుంటే, అది ...
ఒక అద్భుతమైన భావావిష్కరణ గా మారి
ఓ అందమైన రసమయదీపికను
కలల యదార్థ సమ్మిళితం గా మార్చి
కలలో అపురూప పన్నీటి జల్లులనే కురిపిస్తూ..
ఇలలో కన్నీరును తుడిచేస్తూ మన మనసుల్ని పలకరించదూ..!
భావాల అనురక్తికి భాష్యం nice poetry
భావాల అనురక్తికి భాష్యం – your poetry – very nice
ఎంత హాయిగా…రసజ్ఞతను కలిగించేలా ఉందొ మీ కవిత మాధవి గారూ….శుభాకాంక్షలు మీకు
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
ఎంత హాయిగా….రసజ్ఞతను కలిగించేలా ఉందొ మాధవి గారు మీ కవిత…శుభాకాంక్షలు అండీ
మీ రసమయ దీపిక
కవిత బాగుంది.
అభినందనలు
మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్🙏