Menu Close
Geethanjali-page-title

38

THAT I want thee, only thee - let my heart repeat without end. All desires that distract me, day and night, are false and empty to the core.

As the night keeps hidden in its gloom the petition for light, even thus in the depth of my unconsciousness rings the cry - I want thee, only thee.

As the storm still seeks its end in peace when it strikes against peace with all its might,
even thus my rebellion strikes against thy love and still its cry is - I want thee, only thee.

సీ. "నీవెనోయీ ప్రభూ, నీవెకావలె నాకు"
మనసులో సాగనీ మనన మిదియె

నన్ను భంగపరచు నావాంఛలన్నియు
సత్యశూన్యంబవి సర్వగతుల
---
చీకటి నీడలో చిరుదివ్వెకై రాత్రి
కనికరమ్ముగజేయు మనవి వోలె

అవ్యక్త చేతనమ్మందు నిన్నే కోరు
వెల్లువై శోకమ్ము వేడుకొనుచు

ఆ. నీరవమును చెరచు నీరధినితుఫాను
కడకు, శాంతి కోరు కరణి, నేను
ఎంత అలిగి యున్న ఈశ్వరా నీతోడ
మనసు నిన్నె కోరు మరల మరల!!!

39

WHEN the heart is hard and parched up, come upon me with a shower of mercy.
When grace is lost from life, come with a burst of song.

When tumultuous work raises its din on all sides shutting me out from beyond, come to me, my lord of silence, with thy peace and rest.

When my beggarly heart sits crouched, shut up in a corner, break open the door, my king, and come with the ceremony of a king.
When desire blinds the mind with delusion and dust, thou holy one, thou wakeful, come with thy light and thy thunder.

సీ. రసహీనమై హృది రాయిగా మారినన్
కురిపించుమో దేవ!  కరుణ వృష్టి

దయలేక జీవమ్ము తల్లడిల్లిన, ప్రేమ
రాగమాలాపించి రమ్ము స్వామి

అల్లకల్లోలమై అలసిపోవు మదికి
నెమ్మదినిడ రమ్ము నేర్మితోడ

దైన్యతన్ హృదయమ్ము దాగిన యొకమూల,
రమ్ము, ద్వారము దెంచి రాజసముగ

ఆ. మలినమైన కోర్కె మతినిగప్పిన వేళ
తమసు లోన నేను దారి తప్ప,
ఉరుము మబ్బులోన మెరుపు కాంతిగ రమ్ము
వెలిగిపోదు స్వామి నిలిచి నీలొ!!!

40

THE rain has held back for days and days, my God, in my arid heart. The horizon is fiercely naked - not the thinnest cover of a soft cloud, not the vaguest hint of a distant cool shower.

Send thy angry storm, dark with death, if it is thy wish, and with lashes of lightning startle the sky from end to end.

But call back, my lord, call back this pervading silent heat, still and keen and cruel, burning the heart with dire despair.
Let the cloud of grace bend low from above like the tearful look of the mother on the day
of the father's wrath.

సీ. దినములెన్ని గడచె చినుకు మాటయె లేదు
తడిలేని గుండెతో వడలి పోయి

మబ్బుతునక లేదు మచ్చుకైనా గాని
వానమాట మరచి వర్షమాయె

నిలువెల్ల ముంచుమో నీయిచ్ఛయైనచో
ఉరుమువర్షము తోడ ఉర్వియంత

ఉపసంహరింపుమా ఉష్ణతీవ్రత స్వామి
ఎదనుకాల్చక నన్ను వదల దోయి

ఆ. తండ్రి కినుక జూచి తల్లడిల్లిన తల్లి
కనులు తడిగ మారు, కరణి నీదు
కరుణ కురవనిమ్ము కరిమబ్బు వానగా
హృదయ వీథి లోన సుధలు నిండ!!

41

WHERE dost thou stand behind them all, my lover, hiding thyself in the shadows? They push thee and pass thee by on the dusty road, taking thee for naught.

I wait here weary hours spreading my offerings for thee, while passers by come and take my flowers, one by one, and my basket is nearly empty.

The morning time is past, and the noon. In the shade of evening my eyes are drowsy with sleep. Men going home glance at me and smile and fill me with shame.

I sit like a beggar maid, drawing my skirt over my face, and when they ask me, what it is I want, I drop my eyes and answer them not.
Oh, how, indeed, could I tell them that for thee I wait, and that thou hast promised to come. How could I utter for shame that I keep for my dowry this poverty. Ah, I hug this
pride in the secret of my heart.
I sit on the grass and gaze upon the sky and dream of the sudden splendour of thy coming - all the lights ablaze, golden pennons flying over thy car, and they at the roadside standing agape, when they see thee come down from thy seat to raise me from the dust, and set at thy side this ragged beggar girl a-tremble with shame and pride, like
a creeper in a summer breeze.

But time glides on and still no sound of the wheels of thy chariot. Many a procession passes by with noise and shouts and glamour of glory.

Is it only thou who wouldst stand in the shadow silent and behind them all? And only I who would wait and weep and wear out my heart in vain longing?

సీ. ఎవరికంట బడక ఏమూల యుంటివో
విపణివీథిని నీవు వెనక నిలిచి

త్రోసివేయుదురోయి ధూళిలోనన్ నిన్ను
పేరులేక నిలుచు పేదనెంచి

విరిసజ్జ పూర్తియౌ వేళయ్యెనోస్వామి
వేచియుంటినిచట వేయి కనుల

వచ్చిపోయెడివారు పరిహసింపగ నేను
తలవంచి సిగ్గుతో పలుకకుంటి

ఆ. ‌మాట నిచ్చతివని, మరచి పోవని, యెట్లు
దీనురాలి నగుచు తెలుపగలను?
పేదరికమె నాదు పెద్ద కట్నంబను
మదిని మర్మమెటుల మరుగుపరతు?

సీ. నేలపైన యటులె నింగిలోనికి జూచి
కనుమూసి చిత్రమౌ కలనుగంటి

"దేదీప్యమానమౌ దివ్యరథము పైన
వేలప్రభల తోడ, కేల నన్ను,

తేరుపై నీప్రక్క, కూరుచుండగ జేయ
మల్లెతీగగ నిన్ను యల్లుకుంటి

నోట మాటలు రాక, బాటవంక జనులు
చూచుచుండి రటులె చూపు నిలిపి"

ఆ. స్వప్నమాగిపోయె, సమయమ్ము కదలెను
స్వర్ణరథము వచ్చు సడియె లేదు
తీరిపోయె స్వామి తిరునాళ్ళ పర్వమ్ము
సందడంత ఆగి సద్దు మణిగె

ఆ. ఎవరులేని గాఢ ఏకాంత మందున
నిలచియుందు వచట నీవెనేమొ?
పొగిలి పొగిలి యేడ్చి పోలేక ముందుకు
నిలచి యున్న దిచట నేనె నేమొ!!

42

EARLY in the day it was whispered that we should sail in a boat, only thou and I, and never a soul in the world would know of this our pilgrimage to no country and to no end.

In that shoreless ocean, at thy silently listening smile my songs would swell in melodies, free as waves, free from all bondage of words.

Is the time not come yet? Are there works still to do? Lo, the evening has come down upon the shore and in the fading light the seabirds come flying to their nests.

Who knows when the chains will be off, and the boat, like the last glimmer of sunset, vanish into the night?

 సీ. "పడవలోన మనము, బహుదూరపు యాత్ర
పరులకంట బడక జరుపవలయు

అంతులేనిదనియు అలుపు రానిదనియు"
చెవిలోన మెల్లగా చెప్పిరెవరొ
----
తీరమ్ము లేనిదౌ, నీరవాంబుధి నీదు
చిరునవ్వును జూచి, చింత మరచి,

పదజాలమందు నా పాట చిక్కుబడక
ఉరుకు అలల దేలి ఉబ్బిపోవు

ఆ. కార్యభారము నిను కదలనీకుంచెనో ?
వేళకాదు యనుచు వేచినావొ?
జారుతున్నదదిగొ సంద్రమ్ముపై సంధ్య
గూళ్ళు చేరెనవిగొ గువ్వలన్ని

ఆ. ఎవరి కెరుక స్వామి ఏమున్నదో మీద?
ఎపుడు తెగునొ గొలుసులెటుల దెలియు?
రేయి లోన వెల్గు మాయమైన యటుల,
తెగిన పడవ చేరు తీర మెదియొ?

43

THE day was when I did not keep myself in readiness for thee; and entering my heart unbidden even as one of the common crowd, unknown to me, my king, thou didst press the signet of eternity upon many a fleeting moment of my life.

And to-day when by chance I light upon them and see thy signature, I find they have lain scattered in the dust mixed with the memory of joys and sorrows of my trivial days
forgotten.
Thou didst not turn in contempt from my childish play among dust, and the steps that I heard in my playroom are the same that are echoing from star to star.

సీ. జనసమూహము లోన సామాన్యునిగ నీవు
ఎదురుచూడని నాదు ఎదను జొచ్చి

రాజముద్రిక నిచ్చి రయము నేగితివోయి
తళుకు మని మెరసి తారవోలె. 

కట్టెబొమ్మలమధ్య మట్టిలో పడవైచి
దినచర్యలందు నే మునిగిపోతి

నేడుకాంచితి నోయి నీదు కానుకనింట
నాదుస్మృతుల తోడ నలిగిపోయి

ఆ. చిన్నపిల్ల వాని చేష్టయని తెలిసి
తప్పు గాచినావు దయతొ స్వామి!
ఆటగదిని విన్న అడుగుసవ్వడి, నింగి
తార తార నడుమ మారుమ్రోగె

44

THIS is my delight, thus to wait and watch at the wayside where shadow chases light and the rain comes in the wake of the summer. Messengers, with tidings from unknown skies, greet me and speed along the road.

My heart is glad within, and the breath of the passing breeze is sweet.
From dawn till dusk I sit here before my door, and I know that of a sudden the happy moment will arrive when I shall see.
In the meanwhile, I smile and I sing all alone. In the meanwhile, the air is filling with the perfume of promise.

సీ. నీరెండను తరిమి నీడలు పర్వెత్తు
దారిలోన నిలిచి, తన్మయమున

ఎండలో వానకై ఎదురు చూచుటనాకు
ఆనంద మిడునోయి అంతరమున

పలకరింతురు నను వార్తాహరులచట
కనరాని‌ లోకాల కబురు‌ దెచ్చి

తేటగాలిని చుట్టి తీయని గంధమ్ము
హాయినింపుచు నుండె అణువణువున

ఆ. ఇంటిముందు నేను యిరుసంధ్యలందునన్
మారుపలుక కుండ కూరుచుందు
ఎదుట నిలుచు ఘడియ ఇప్పుడో ఇంకనో
కలుగు నంచు నాకు తెలియు స్వామి!

ఆ. అంత వరకు నేను సంతసమ్మున నీదు
పాట పాడుచుందు పరవశించి
వీచు గాలి నాదు విశ్వాసమును పెంచి
పరిమళమ్ము జల్లు ప్రకృతి లోన

45

HAVE you not heard his silent, steps? He comes, comes, ever comes.

Every moment and every age, every day and every night he comes, comes, ever comes.

Many a song have I sung in many a mood of mind, but all their notes have always proclaimed, "He comes, comes, ever comes."
In the fragrant days of sunny April through the forest path he comes, comes, ever comes.
In the rainy gloom of July nights on the thundering chariot of clouds he comes, comes, ever comes.
In sorrow after sorrow it is his steps that press upon my heart, and it is the golden touch of his feet that makes my joy to shine.

సీ. వినలేదా నీవు! వీనులకందక,
నడచివచ్చు ప్రభుని అడుగుల సడి?

పవలు రేలను వచ్చు ప్రతియుగమ్మున వచ్చు
నిమిష నిమిషమొచ్చు, నిరతమతడు
---
నాదుగానము యెన్ని నడకలు నేర్చినా
స్వామిరాకను దెల్పు సంగతులగు

వడిగ యడవిలోన వైశాఖమందునా
అలరుసోనలగంధ మలదుకొనుచు

ఆ. శ్రావణమున స్వామి జడివానతో వచ్చు
మెరుపు రథముపైన మెరిసిపోయి
వెతలువీడి హృదయ మతనిపాదము సోకి
పొంగిపోవు నెగసి నింగి వరకు

Posted in September 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *