Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౯౫౯. కంతి బలుపూ కాదు, చింత తీరికా కాదు...

౯౬౦. కందకు లేదు, చేమకూ లేదు, తోటకూరకొచ్చిందేమిటి దురద!

౯౬౧. కందిన వెయ్యని బండి పాడుతుంది కావలసినంత సంగీతం.

౯౬౨. కంబళిలో అన్నంవడ్డిం చుకుని, ముద్దముద్దకూ వెంట్రుక లొస్తున్నాయని  పిర్యాదు చేశాడుట!

౯౯౩. కంసాలి ఇంటి కెళ్ళి కూర్చుంటే బంగారం అంటుకోదుగాని, కుమ్మరింటికి వెళ్లి కూర్చుంటే మాత్రం మట్టి అంటుకోడం ఖాయం.

౯౯౪. కట్టుకున్నవాడికి ఒకటే ఇల్లుగాని, అద్దెకుండే వాడికి అన్నిళ్ళూ వాడివే.....

౯౯౫. కడుపు కూటి కేడిస్తే, కొప్పు పూల కేడ్చిందిట!

౯౯౬. కడుపులోని మంట కనిపించని మంట.

౯౯౭. కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా ...

౯౯౮. కత్తి తలగడ కాలేదు, కల నిజమూ కాలేదు.

౯౯౯. కత్తి కంటే కలానికి వాడి ఎక్కువ.

౧౦౦౦. కథ అడ్డం తిరిగింది....

౧౦౦౧. కథ కంచికి, మనం ఇంటికి.

౧౦౦౨. కదురు, కవ్వం ఆడిన నన్నాళ్ళు మనకు కరువు రాదు.

౧౦౦౩. కన్నీరు క్రిందికి కారితే పన్నీరు పైకి చిమ్ముతుంది.

౧౦౦౪. కన్నూ మనదే, వేలూ మనదే కదాని వేలుతో కన్ను పోడుచుకుంటారా ఎవరైనా ...

౧౦౦౫. కయ్యానికైనా, నెయ్యానికైనా, వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి.

౧౦౦౬. కర్మ ఛండాలునికంటే జన్మ ఛండాలుడు మేలు.

౧౦౦౭. కర్ణుడు లేని భారతం, శొంఠి లేని కషాయం లాంటిది.

౧౦౦౮. కర్ణుడి చావుకి కారణాలు అనేకం.

౧౦౦౯. కొర్రు ఎంత అరగితే కాపు కంత మంచి జరుగుతుంది.

౧౦౧౦. కలలోని వైభోగం కళ్ళు తెరిచే వరకే...

౧౦౧౧. కలలోని కాంతని, నీటిలోని నీడని తాకలేవు.

౧౦౧౨. కలవారికి అంతా బంధువులే!

౧౦౧౩. కలుపు తీయని మడి, దేవుడు లేని గుడి!

౧౦౧౪. కలుపు తియ్యని పొలంలో కోత కొయ్యవలసిన పని ఉండదు.

౧౦౧౪. కల్యాణమని ఒకడు వస్తే, కాజేయ్యడానికి మరొకడు వచ్చాడు.

౧౦౧౫. కల్లా కపటం తెలియని వారికి కష్టాలు తప్పవు.

౧౦౧౬. కల్ల బంగారానికి కాంతి ఎక్కువ.

౧౦౧౭. కల్తీ విత్తనాలు - వెలితి గాదెలు...

౧౦౧౮. కవికి మెప్పు, కాంతకు కొప్పు అందగిస్తుంది.

౧౦౧౯. కళ్ళు రెండున్నా కనిపించేది ఒకటే!

౧౦౨౦. కసవు లేనిదే పశువు లేదు, పశువు లేనిదే పెంట రాదు, పెంట లేనిదే పంట ఉండదు.

Posted in September 2020, సామెతలు

2 Comments

  1. వెన్నెలకంటి సుబ్బు నారాయణ

    కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు

    వండుకున్న అమ్మకు ఒకటే కూర, అడుక్కున్న అమ్మకు అరవై నాలుగు

    ఇవి అసలు సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!